ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జగన్ సర్కార్ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మరిన్ని సడలింపులకు సిద్ధమైందని సమాచారం. సీఎం జగన్ కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం లాక్ డౌన్ వెసులుబాటు సమయాన్ని పెంచే దిశగా కసరత్తులు చేస్తోంది. 
 
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేలా సరి - బేసి సంఖ్యలో దుకాణాలను విభజించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం సొంత వాహనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం సరి బేసి సంఖ్యలో దుకాణాలను విభజించి త్వరలోనే సాధారణ కార్యకలాపాలకు అనుమతులివ్వనుందని తెలుస్తోంది.
 
ఏపీ ప్రభుత్వం కేంద్రం సూచనల మేరకు సొంత వాహనాల నియంత్రణకు కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిమిత సంఖ్యలో వాహనాల రాకపోకలను అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటివరకు రాష్ట్రంలో 1930 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 887 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 44 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. 
 
మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో నిన్న 43 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో అధిక సంఖ్యలో కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో నిన్న 6 కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 553కు చేరింది. జిల్లాలో ఇప్పటివరకు 239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: