మదర్స్ డే అనేది అత్యంత విలువైన దేవత లాంటి అమ్మ కు కృతజ్ఞతలు చెప్పడానికి సరైన రోజు. కానీ మన అమ్మకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ ఒక్క రోజే సరిపోదు. అందుకే ఈ ఒక్క రోజైనా మన జీవితంలో సూపర్ హీరోల కంటే ఎక్కువ బరువు బాధ్యతలను మోస్తున్న తల్లుల కోసం మనమందరము క్షమించే వాళ్లను స్పెషల్ గా ఫీల్ అయ్యేట్టు చేయాలి. ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాలలో అమ్మ గురించి ఎంతో మంది ఎన్నో పోస్టులు పెడుతున్నారు.


కేవలం వారి ప్రేమ పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా వారి వారి అమ్మ కోసం ఇంకా ఎక్కువగా ఆప్యాయత ప్రేమ లతో కృతజ్ఞతలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం భారతదేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి... చాలా మంది తమ తల్లులకు దూరంగా ఎక్కడో దూర ప్రదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తాజాగా తాను తన అమ్మతో కలిసి ఉన్న ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన అభిమానులు అందరకు తీయటి అనుభూతిని కల్పించింది.


సారా అలీ ఖాన్ తాను జన్మించినప్పుడు తన అమ్మ అమ్మమ్మ కలిసి దిగిన ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. సారా అలీ ఖాన్ తల్లి పేరు అమృతాసింగ్. ప్రస్తుతం షూటింగులు లేక ముంబై లోని తన ఇంటికే పరిమితమైన సారా అలీ ఖాన్ తన తల్లి అమృతా సింగ్ తో విలువైన సమయాన్ని గడుపుతోంది. తను, తన తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్ కలిసి అమృతా సింగ్ కోసం మాతృ దినోత్సవ వేడుకలను గ్రాండ్ గా జరుపుతున్నారు. ఇకపోతే, ఆమె ప్రస్తుతం రెండు మూడు చిత్రాలలో నటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: