విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకై వేలాది మంది అస్వస్థతకు గురవ్వగా, సుమారు 11 మంది మరణించారు. అయితే ఈ సంఘటనపై ఏపీ సీఎం జగన్, స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చాలా వేగంగా స్పందించారు. బాధితులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి సకాలంలో చికిత్స అందించారు. అయితే ఈ సంఘటనలో పూర్తిగా ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పిదం కారణమైనా , ఏపీలో మాత్రం రాజకీయ విమర్శలుకు ఈ వ్యవహారం మరింత ఆజ్యం పోసింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగన్ భారీ నష్టపరిహారం బాధితులకు అందించారు. దీనిపై టిడిపి మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు జగన్ ను ప్రశంసించారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ వ్యవహారం పై అనవసర రాద్దంతానికి తెర తీసింది. ముఖ్యంగా విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటన ను వైసీపీకి ముడిపెట్టి రాజకీయ విమర్శలకు తెర తీశారు. 

IHG


వైసీపీ ప్రభుత్వం అందించిన పరిహారం పైనా చంద్రబాబు ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే అసలు ఎల్జి పాలిమర్స్ కంపెనీ పై టిడిపి చేస్తున్న ఆరోపణలపై లోతుగా పరిశీలిస్తే... 1961 లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇప్పటికీ 60 ఏళ్లుగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది స్థాపించిన సమయంలో విశాఖ చాలా చిన్న నగరంగా ఉండేది. ఈ కర్మాగారం చుట్టుపక్కల నివాసాలు కూడా ఉండేవి కాదు. ఆ తరువాత ఈ కర్మాగారంకు ఆనుకొని నివాసాలు ఏర్పడడంతో ఇప్పుడు ప్రమాద తీవ్రత ఎక్కువయ్యింది. అయితే 2018 లో ఇదే కర్మాగారానికి 400 టన్నుల ఉత్పత్తి నుంచి 600 టన్నుల ఉత్పత్తికి పెంచుకోవాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అప్పుడు ఏ విధంగా అనుమతి ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

 


 కానీ ఆ సంగతి మర్చిపోయి టిడిపి నాయకులు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అసలు 1997 సెప్టెంబర్ లోనే ఈ కర్మాగారం భారీ పేలుడు జరిగింది. గ్యాస్ సిలెండర్లు పేలిపోయాయి. సుమారు 60 మంది వరకు మరణించారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి  ప్రమాదంపై దృష్టి పెట్టి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు. అంతేకాకుండా టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక సార్లు ఇటువంటి కర్మాగారాల ప్రమాదాల గురించి ఫిర్యాదు చేశామని, విశాఖకు చెందిన మేధావులు, నిపుణులు చెబుతున్నారు. కానీ అప్పుడు స్పందించని టీడీపీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంపై తెలుగు దేశం పార్టీ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: