ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ త్వరగా అభివృద్ధి చెందుతోందంటున్నారు టీఆర్‌ఎస్ పాలకులు. అందుకు తాజాగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం ధాన్యసేకరణ కొనుగోళ్ల వివరాలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరిగిన ధాన్య సేకరణలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల నుంచే అత్యధికంగా వాటా ఉంది. కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ వివరాలు వెల్లడించారు. గోధుమలు, ధాన్యం కొనుగోళ్లపై సమాచారం ఇచ్చారు.

 

 

విచిత్రం ఏంటంటే.. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ధాన్యసేకరణ జరిగేది.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటున్నారు తెలంగాణ పాలకులు. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన 50లక్షల టన్నుల ధాన్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 44.36లక్షల టన్నులు. అందులోనూ అందులో ఒక్క తెలంగాణ నుంచి 34.36లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి పది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పాశ్వాన్ లెక్కలు చెప్పారు.

 

 

 

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ.. రబీలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలవడం గర్వకారణమన్నారు. ఇది తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భమన్నారు. తెలంగాణ సాధించిన ఆరేళ్లలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కనిపిస్తోందని కేటీఆర్ కామెంట్ చేశారు.

 

 

అయితే దీన్ని బీజేపీ అంగీకరించడం లేదు. కోటి టన్నుల దాన్యం కొంటామని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఇరవై లక్షల టన్నులే కొనుగోలు చేసిందని ఆయన విమర్శించారు. ధాన్యాన్ని సేకరించే దమ్ము ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి రాష్ట్రం బులిటిన్ విడుదల చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ఆరోపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: