అమ్మ అనే రెండు అక్షరాలు ఎంతో విలవకట్టలేనివి అమ్మ తాను పొందిన వాటికన్నా తమ బిడ్డలకు ఎంతో ఆప్యాయతను తిరిగి ఇస్తుంది అందుకే ఎలాంటి గొప్ప వ్యక్తికైనా అమ్మ ఒక పునాది. అమ్మ నుంచే జీవం మొదలవుతుంది. అమ్మ అక్షరాలు దిద్దించే మొదటి గురువు. 


అమ్మకు కుటుంబాన్ని చక్కదిద్దడమే కాదు అమ్మకు కోపం వస్తే కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. అమ్మ గొప్పతనాన్ని గుర్తించి శక్తి స్వరూపిణి గా పూజిస్తారు. అమ్మ కళ్ళముందు నడియాడే అద్భుతం అందుకే ప్రపంచ వ్యాప్తంగా అమ్మను గౌరవించని వారుండరు. ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవంగా పరిగణిస్తూ ఉంటారు. ఇలా అందరు ఈరోజు మదర్స్ డే ను జరుపుకోవడం వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. 


గ్రీస్‌ లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’ గా భావించి సంవత్సరానికి ఒకసారి ఈరోజును ఒక పండుగగా జరుపుకుంటారు. అయితే ఆతరువాత 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో అమ్మకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరపడం ప్రారంభం అయింది. ‘జూలియవర్డ్‌ హోవే’ మహిళ అమెరికాలో 1872 లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం ‘మదర్స్‌ డే’ నిర్వహించాలని చేసిన ప్రతిపాదనతో ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే ని జర్పుకోవడం ఒక అలవాటుగా మారింది. 


వాస్తవానికి భారతీయ సంస్కృతిలో తల్లిని గౌరవించే సాంప్రదాయం అనాది కాలం నుండి వచ్చింది. వేదకాలంలోని ఆనాటి వ్యక్తులు తమ తల్లి పేరును తమ ఇంటి పేరుగా కొనసాగించే వారు. ఇప్పటికీ అనేక దేశాలలో ప్రస్తుతం ఒక వ్యక్తి తన తల్లి పేరు ను ఇంటి పేరుగా కొనసాగించే పద్ధతి కొనసాగుతోంది. ఒకప్పటి సమిష్టి కుటుంబాలు నేడు దేశంలో అంతరించిపోయినా ఇప్పటికీ ప్రేమలు అనురాగాలు తన బిడ్డకు నేర్పడంలో తల్లి ప్రధమ పాత్ర వహిస్తుంది. తన బిడ్డ తప్పులను సరిదిద్దుతూ ఆ బిడ్డకు భవిష్యత్ ను కలిగించే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. 


అమ్మ కాపాడే దైవం అమ్మ తన ప్రేమను ఆప్యాయతను కలబోసి ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా సమయంలో కూడ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తన శక్తికి మించి పనిచేస్తూ వ్యక్తిగత పరిధులను దాటి అమ్మ తనంతో అందర్నీ రక్షిస్తున్న ఎందరో తల్లులకు శతకోటి వందనాలు సమర్పిస్తూ మాతృదినోత్స వందనాలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: