కారుతో ఢీ కొట్టి హతమార్చిన ఒక కేసును ప్రకాశం జిల్లా పోలీసులు కంభంలో చేధించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... జిల్లాలోని కంభం ప్రాంతంలో ఒక యువకుడి దారుణ హత్య కేసును వారు ఛేదించడం జరిగింది. నన్ను చంపుతారేమో అన్న భయంతోనే కాశీవిశ్వేశ్వరరావు కారుతో ఢీ కొట్టి చంపినట్లు పోలీసులు విచారణలో నిందితుడు అయిన కరుణాకర్ ఒప్పుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం పోరుమామిళ్ల పల్లికి చెందిన కాశీ విశ్వేశ్వరరావు విజయవాడ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడు. ఇకపోతే గోవిందపురం గ్రామానికి చెందిన వెంకట కరుణాకర్ అతనికి బంధువు. ఇక అసలు విషయం ఏమిటంటే... విజయవాడలో ఉంటున్న కరుణాకర్ తన మేనకోడలిని కాశీవిశ్వేశ్వరరావు తరచూ వెంటాడి వేధించే వాడట. దీనితో వారిద్దరి మధ్య అనేక సార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ విషయం మధ్య వీరిరువురు పోలీస్ స్టేషన్ లో విడివిడిగా కేసులు కూడా పెట్టుకున్నారు.

 


అయితే రెండు రోజుల క్రితం వారిద్దరు తమ తమ స్నేహితులతో వేరువేరుగా మద్యం సేవిస్తున్న సమయంలో కాశీవిశ్వేశ్వరరావుకు కరుణాకర్ ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఫోన్ సంభాషణలో తన మేనకోడలు జోలికి మరోసారి రాకుండా ఉండమని వస్తే  ఊరుకొనడం అంటూ ఉండదని హెచ్చరించడం జరిగింది. ఈ విషయంపై తనను చంపేందుకు కాశీవిశ్వేశ్వరరావు బైక్ పై వస్తున్నాడని విషయాన్ని తెలుసుకున్న కరుణాకర్ ఒక కారు తీసుకుని దారి మధ్యలోనే అతడిని ఢీ కొట్టేశాడు. అయితే అతడు చనిపోలేదని నిర్ధారించుకున్న కరుణాకర్ మరోసారి కారుతో ఢీ కొట్టి అతని ప్రాణాలను తీసేసాడు.

 


ఇక ఆ సంఘటన తర్వాత కరుణాకర్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందర సరెండర్ అయ్యాడు. ఇక దీనితో పోలీసులు కాశీవిశ్వేశ్వరరావు, కరుణాకర్ మొబైల్స్ ను స్వాధీనం చేసుకొని కాల్ రికార్డులను పరిశీలించారు. దీంతో జిల్లా డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి మార్కాపురం సి ఐ, ఏ ఎస్ ఐ, ఎస్ ఐ మాధవరావు సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని ఆధారాలు గమనించిన పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: