పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది వెండి తెర మీద ఆయన పేరుకు ముందు బిరుదు. రాజకీయాల్లో మాత్రం జనసేన అధినేతగానే ఉన్నారు. ఎమ్మెల్యే  అవుదామని రెండు చోట్ల పోటీ చేస్తే ఎక్కడా గెలవలేదు. పాతికేళ్ల రాజకీయం, పదవులు అక్కరలేదు అని పవన్ చెబుతున్నా కూడా ఆయన రాజకీయాల్లో పల్లాలే కానీ ఎత్తులు కనిపించడంలేదు.

 

దాంతో పవన్ ఇపుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024లో రెండు పార్టీలు కలసి అధికారంలోకి వస్తాయని పవన్ ధీమాగా చెప్పుకొచ్చారు. అవన్నీ పక్కన పెడితే ఏపీలో బీజేపీ బేస్ పెద్దగా లేదు. జనసేన విషయం తీసుకుంటే అభిమానులు ఉన్నారు కానీ పార్టీ పట్టాలెక్కలేకపోతుంది. 2019 ఎన్నికల ముందు చేరిన నాయకులు కూడా తప్పుకున్నారు. మునుపటి జోష్ పార్టీకి తగ్గిపోయింది. ఇక ఇపుడు  పవన్ లాక్ డౌన్ నేపధ్యంలో హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. 

 

ఈ నేపధ్యంలో పవన్ ట్విట్టర్ కి పని చెప్పారు. ఆయన హఠాత్తుగా బీజేపీకి చెందిన  నేతలను తెగ పొగుడుతున్నారు. వారిలో  భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఉన్నారు.  ఆయన గొప్ప నేత అని, ముక్కు సూటి మనిషి అని, మొహమాటం లేని నేత అని పవన్ అంటున్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకావాలి అని కూడా అంటున్నారు. ఇదే పవన్ 2017 టైంలో వెంకయ్యనాయుడుని తీవ్రంగా విమర్శించారు. ఆయన కేంద్రంలో ఉండి పాచిపోయిన లడ్డూలను ఏపీకి ఇప్పిచారని కూడా పవన్ గట్టిగా హాట్ కామెంట్స్ చేశారు.


.

మరి పవన్ కి ఇపుడు వెంకయ్యనాయుడు బాగా నచ్చుతున్నారు. పైగా ఇది సందర్భం కూడా కాదు, అయినా కూడా ట్విట్టర్ వేదికగా ఆయన్ని పవన్ పొగుడుతూంటే ఎందుకోనన్న చర్చ కూడా సాగుతోంది. అక్కడ అమిత్ షాకు క్యాన్సర్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటే అమిత్ షా కంటే ముందే పవన్ ఖండించేస్తున్నారు. మోడీ ఏది మాట్లాడినా చప్పట్లు కొడుతున్నారు. మరి ఏమో కానీ పవన్ కి బీజేపీ మీద, ఆ పార్టీ పెద్దల మీద లవ్వు ఒక్కసారిగా పెరిగిపోతోంది.

 

ఎందుకో ఇది అని అంతా అనుకుంటున్నారు. తన పార్టీని బీజేపీతో పొత్తు కలిపారు. ఇపుడు ఏకంగా విలీనం చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోందిట. దీని మీద చాలా మంది డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ పార్టీ బీజేపీలో విలీనం అయినా కాకపోయినా ఏపీ రాజకీయాల్లో మార్పులు పెద్దగా ఉండవని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: