తాజాగా తమిళనాడులో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య అందరినీ తీవ్ర కలకలం చేస్తుంది. చెన్నై నగరంలోని మెరీనా బీచ్ సమీపంలో ఒక డాక్టర్ మృతదేహం తీరం ఒడ్డుకు కొట్టుకు రావడంతో అందరినీ కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే విరుగంబాక్కం శ్యామలా గార్డెన్‌ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌ (34) పోరూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకుంటూ.. పళ్ళికరణైలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ గా విధులు చేస్తున్నాడు. 

 


ఇక తన ఇంటి నుంచి ఆస్పత్రికి మల్లికార్జున్ బయలుదేరిన కొద్ది సమయానికి అతని తమ్ముడు సెల్ ఫోన్ కి ఒక మెసేజ్ పంపించాడు... ఆ మెసేజ్ లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని దానికి ఎవరు కారణం కాదు.. నువ్వే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని మల్లికార్జున్ తన తమ్మునికి మెసేజ్ పంపాడు. అలాగే తన కారును మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ వద్ద పార్క్ చేసి ఉంచుతా అని మెసేజ్ లో తెలియజేశాడు. ఇక ఆ మెసేజ్ చూసిన తమ్ముడు అజయ్ కంగారుపడి వెంటనే మెరీనా బీచ్ దగ్గరకు వెళ్లగానే లైట్ హౌస్ సమీపంలో కారు కనిపించింది. 

 

దింతో సముద్రం తీరం మొత్తం చాలా సేపు వెతికాక సాయంత్రం 7 గంటల సమయంలో మల్లికార్జున మృతదేహం అజయ్ కు దొరకడం జరిగింది. దీనితో వెంటనే మెరీనా బీచ్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకొని... మల్లికార్జున ఆత్మహత్య చేసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు సేకరించే పనిలో పడ్డారు. ఏదిఏమైనా ఎదిగిన కుమారుడు ఇలా అర్దాంతరంగా జీవితాన్ని ముగించడంతో తన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: