దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. చాలా తక్కువ పరీక్షలు నిర్వహించడం వల్ల కేసులు బయటపడటం లేదు ఇటువంటి టైములో లాక్ డౌన్ తీసేస్తే తెలంగాణలో భయంకరంగా పాజిటివ్ కేసులు బయటపడతాయని వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో కరోనా వైరస్ ప్రభావం చాల గట్టిగా ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 

ఈ విధంగా ప్రభుత్వం మరియు అధికారులు కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం అనేక ప్రయత్నాలు మరియు ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటిస్తూ ఉంటే మరోపక్క అధికారంలో ఉన్న  'కామాంధులు' హైదరాబాద్ ని నాశనం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో వనస్థలిపురం ని కంటైన్మెంట్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇటువంటి సమయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లాక్ డౌన్ టైమ్ లో తన స్నేహితుడితో ఒక లాడ్జి ఓనర్ తో కలిసి ముగ్గురు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. దీంతో వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ భార్య మొత్తం తెలుసుకుని స్వయంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్ పై రైడ్ చేశారు. వైస్ ఛైర్మన్ తో పాటు ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైస్ ఛైర్మన్ ఫ్రెండ్, లాడ్జ్ ఓనర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో హైదరాబాద్ వాసులు ఇవేమి పనులు రా దరిద్రుల్లారా అంటూ మండిపడుతున్నారు. కరోనా వైరస్ నుండి బయటపడటానికి మేము నానా తిప్పలు పడుతుంటే మీరు కామ కోరికలు తీర్చుకుంటారా..? సిగ్గులేదా మీకు అని విమర్శలు చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ ని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: