ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్ వల్ల అల్లాడిపోతున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావటంతో అన్ని దేశాల ప్రజలను ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు పరిశోధకులు రాత్రింబవళ్లు చేస్తూనే ఉన్నారు.

 

ఇలా ప్రయోగాలు చేస్తున్న తరుణంలో కరోనా వైరస్ ఎటువంటి ఉపరితలాలపై ఎన్ని గంటల పాటు ఉంటుంది అన్న దానికి సంబంధించిన అంశాలు ఓ నివేదికలో పొందుపరిచి తయారు చేశారు. తాజాగా సెక్స్ సంబంధించిన నివేదిక బయటపడింది. చైనా మరియు అమెరికా దేశానికి చెందిన పరిశోధకులు జరిపిన ఈ పరీక్షల్లో  వీర్యకణాల్లో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. చైనాలోని షాంగిక్యూ హాస్పిటల్ లో కరోనాతో బాధపడుతున్న 38 మంది నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించగా వాళ్ల వీర్యంలో కోవిడ్-19 వైరస్ ను గుర్తించారు.

 

ఇదిలా ఉండగా వీర్యంలో కరోనా ఎన్ని రోజులు ఉంటుంది.. కరోనా వైరస్ ఉన్న వ్యక్తి సెక్స్ చేస్తే సదరు మహిళకు కూడా కరోనా వస్తుందా అనే అంశాలపై మాత్రం ఇంకా పరిశోధన కొనసాగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తుల వీర్యంలో వైరస్ లేదని గుర్తించారు వైద్యులు. ప్రజెంట్ అయితే వీటికి సంబంధించిన కరోనా వైరస్ ప్రయోగాలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ముందు జాగ్రత్తగా రెండు వారాలపాటు శృంగారానికి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. లేకపోతే వైద్యులు బలవంతంగా ' సెక్స్ క్వారంటీన్ ' కి లాక్కెలే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: