ఈ మద్య కాలంలో సెలబ్రెటీలు వరుస మరణాలు సంబవిస్తు న్నాయి.  సీనీ పరిశ్రమలో వరుస మరణాల సంబవించిన విషయం తెలిసిందే.  తాజాగా ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కోమాలోకి వెళ్లారు. 74 ఏళ్ల అజిత్ శనివారం ఉదయం చింతపండు తినేటప్పుడు, అందులోని గింజ ఆయన శ్వాసనాళంలో ఇరుక్కుంది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. క్రమంగా ఆయన కోమాలోకి జారుకున్నారు. ఆయనకు గుండె పోటు వచ్చిందని కుటుంబసభ్యులు అనుకున్నారు. ప్రస్తుతం రాయిపూర్ లోని శ్రీ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి అజిత్ జోగి   అత్యంత విషమంగా ఉంది. 

 

 

ఈ మేరకు ఆసుపత్రి  వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. అజిత్ జోగి మెదడుకు ఆక్సిజన్ అందని కారణంగా ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు ఆపరేషన్ ద్వారా చింతపండు గింజను వైద్యులు తొలగించారు. జోగి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సమయంలోనే ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు.   రాబోయే 48 నుండి 72 గంటలు ఆయనకు చాలా ముఖ్యమైనదని తెలిపింది.  కాగా,  ఆసుపత్రి ఆరోగ్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది.

 

2004లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అజిత్‌ జోగి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన వీల్‌చైర్‌ కే పరిమితమయ్యారు. 2000 సంవత్సరం నవంబర్‌లో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.   2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన సొంతగా జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌(జే) ప్రాంతీయ పార్టీ పెట్టారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మాజా ముఖ్యమంత్రి అజిత్‌ జోగి  పరిస్థితి ఇలాంటి పరిస్తితి లో ఉండటం పట్ల పలువురు నేతలు ఆయన తిరిగి కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: