ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు లేకపోవటంతో చాలా దేశాల నాయకులు ఏమి చేయలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటమే ప్రధాన లక్ష్యమని లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో చాలా వరకు దేశాలు ఆర్ధికంగా నష్టపోవటం జరిగాయి. భారతదేశంలో కూడా దాదాపు 40 రోజులకు పైగానే కఠినంగా లాక్ డౌన్ దేశంలో అమలు చేయడం జరిగింది. అయితే ఇటీవల మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ కొన్ని వాటికి సడలింపు లో మినహాయింపు ఇవ్వడం జరిగింది. మూడో ద‌శ లాక్‌డౌన్ నేప‌థ్యంలో గ్రామీణ ప్రాంతాలు, క‌రోనా ప్ర‌భావం లేని ప్రాంతాల్లో అనగా గ్రీన్ జోన్ వంటి ప్రాంతాలలో సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి , ప‌రిశ్ర‌మ‌లు ఓపెన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేనందున వాటిని ప్రారంభించుకోవచ్చు అని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

 

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు వంటి మ‌ద్యం దుకాణాల‌ను తెరుచుకునేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణ‌య‌మే ఇప్పుడు మ‌ళ్లీ దేశంలో క‌రోనా వ్యాప్తికి కార‌ణంగా మారింద‌నే వ్యాఖ్య‌లు బలంగా  వినిపిస్తున్నాయి. మే నెల 4వ తారీకు నుంచి మూడో ద‌శ లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో... చాలా అంశాలలో కేంద్రం వెసులుబాటు కల్పించడం తో ప్రజలు యధావిధిగా రోడ్ల మీదకు వస్తున్నారు. పరిశ్రమలు మరియు కంపెనీలు మెల్ల మెల్లగా తెరుచుకున్నాయి.

 

దీంతో యధావిధిగా జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు రోడ్డెక్కిన ప్రజలు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అంద‌రూ తుంగ‌లో తొక్కారు. మాస్కులు క‌నిపించ‌డం లేదు. అత్యంత కీల‌క‌మైన సోషల్ డిస్టెన్స్ ఏమి పాటించకుండా...ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు బాగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. వైద్యులు అంతా వీటిని గమనించి దేశంలో మళ్లీ COVID 2.0 మొదలైంది...ఇంత మంది ప్రజలు కలిగిన ఈ దేశం లో వైరస్ వ్యాప్తిస్తే తీవ్ర దుష్పరిమాణాలు ఉంటాయని ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: