కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయటంతో వలస కూలీల ఇబ్బందులు చూసి వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్లిన కూలీలు నానా తిప్పలు పడటంతో వారి బాధలు చూసి వారికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక ట్రైన్ లు తిపుతున్నారు. మరోపక్క విదేశాలనుంచి స్వదేశానికి చెందిన కూలీలు కూడా భారీ ఎత్తున వస్తున్న తరుణంలో దేశంలో ఇప్పటి వరకు లాక్ డౌన్ పాటించిన వాళ్ళు వామ్మో అని అంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విదేశాలనుండి స్వదేశంలోకి వచ్చినవారికి రాగానే స్క్రీనింగ్ పరీక్షలతోపాటు అనుమానితుల కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

 

క్వారంటైన్‌లో కూడా వుంచుతారు. ఇందు కోసం ‘పెయిడ్‌ క్వారంటైన్‌’ని కూడా కేంద్ర రాష్ట్రాలు పరిశీలిస్తుండడం గమనార్హం. విదేశాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల మధ్య అటూ ఇటూ రాకపోకలు రాబోతున్న తరుణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ముందు ముందు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరొక పక్క క్వారంటైన్‌ తప్పనిసరి గనుక.. కేసులు పెరిగినా, ‘వ్యాప్తి’ మరీ ఎక్కువగా వుండకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య  దాదాపు 70 వేలకు దగ్గరలో ఉంది.

 

ఇటీవల రెండుమూడు రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాలా వేగవంతంగా పెరిగాయి. మొత్తంమీద చూసుకుంటే లక్షకు దగ్గరలో వచ్చే వారం లోపు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో దేశంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఇతర దేశాలలో మరియు రాష్ట్రాలలో ఉన్న వారు కరోనాని నెత్తిన పెట్టుకుని నడుచుకొని వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదని జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: