వార్త ఒక్కటే.. కానీ దాన్ని చూసే కోణాలు వేరు.. ఆ వార్త ఎవరికి సంబంధించినదన్న అంశం కూడా ఆ వార్త ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తేలుస్తాయి. అదేంటి.. వార్తకు ఉన్న ప్రాధాన్యత ను బట్టి కదా.. ఆ వార్త ప్రజంటేషన్ ఎలా ఉండాలో నిర్ణయించేది అంటారా.. అంత సీన్ లేదు.. తెలుగులో కొన్ని పత్రికల సంగతి తెలుసు కదా.. ఒకే ఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి ప్రాధాన్యత మారిపోతుంది.

 

 

ఇందుకు తాజా ఉదాహరణ చూద్దాం.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందన్న వార్త వచ్చింది. తెలంగాణలో ఎక్కువగా టెస్టులు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామనే నిర్ణయానికి కారణం ఏమిటో చెప్పాలని అడిగింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న సాంకేతిక కారణాలేంటో చెప్పగలరా అని ఆదేశించింది.

 

 

అంతే కాదు.. ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలకు కరోనా టెస్టులు చేయకుండానే కేసులు తగ్గాయని లెక్కలు ప్రకటించడాన్ని ఆక్షేపించింది. ఇలా చేయడం ప్రజలను ఫూల్స్‌‌ చేయడమే అవుతుందని కామెంట్ చేసింది. చనిపోయిన వ్యక్తికి టెస్టులు చేయొద్దని ఆ గైడ్ లైన్స్ లో ఎక్కడా లేదని పేర్కొంది. రిటైర్డు ప్రొఫెసర్‌‌ పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ వ్యాఖ్యలు చేసింది.

 

 

ఇది జరిగింది తెలంగాణలో.. చెప్పింది తెలంగాణ హైకోర్టు.. అందుకే తెలుగులో ప్రధాన పత్రికలైన ఆ రెండు పత్రికలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇదే సీన్ ఏపీ హైకోర్టులో జరిగి ఉంటే.. హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని అన్ని మాటలు అని ఉంటే.. బ్యానర్ కథనాలు ఇచ్చి, ప్రత్యేక కథనాలు వేసి.. కుమ్మిపారేసేవి. అది జరిగింది తెలంగాణలో కాబట్టి నామమాత్రంగా ఇచ్చి సరిపుచ్చాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: