అనుభవం లేకుండా జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిపాలన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖ నాయకులను అదే విధంగా జాతీయ మీడియాలో సైతం ప్రభావితం చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ కట్టడి విషయంలోనే గాని ఇసుక విధానంలోనే గాని జగన్ నిర్ణయాలు చాలామందిని ఆకట్టుకోవటం జరిగింది. ఇటువంటి సందర్భంలో దేశానికి వెన్నెముక వ్యవసాయంలో జగన్ తాజాగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంది ముఖ్యమంత్రులు రైతులకు పెద్ద పీట వేస్తున్నారు. పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు అనే కార్యక్రమం ద్వారా రైతులకు ఎన్నో మేలులు చేస్తున్నారు. ఇదే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ కూడా రైతు భరోసా పేరుతో రైతులకు మేలు చేస్తున్నారు. రైతు పెట్టుబడుల కోసం సాగు కోసం నగదు రూపంలో సహకారం ఈ పథకాల ద్వారా అందిస్తున్నారు.

 

ప్రతి ఏటా ఈ పథకం ద్వారా రైతులకు 12500 రూపాయలు జగన్ సర్కార్ నిర్ణయించడం మనకందరికీ తెలిసిందే. ఈనెల 10వ తేదీ ఆఖరి తేదీ కావటంతో 'రైతు భరోసా' పథకం కింద రైతులు దరఖాస్తు చేసుకోవటం కోసం రైతులు తెగ ఎగబడుతున్నారట. ఈ నేపథ్యంలో అర్హులైన రైతుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయం లో ప్రదర్శించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల వ్యవసాయశాఖ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ అధికారులకు ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది.

 

అంతే కాదు ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్ కి అధికారులు తెలిపారు. జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అన్ని రకాలుగా రైతులను ఆదుకోవాలని వేతనాల విషయంలో ఇంకా కరోనా వైరస్ కారణంగా వచ్చే సమస్యల విషయంలో అధికారులు మరియు జగన్ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో రైతు భరోసా పథకం కింద త్వరలో రాష్ట్రంలో జగన్ అమలు చేయబోతున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. చాలా వరకు ప్రభుత్వాలు జగన్ మాదిరిగానే విత్తనాలు సరైనవి ఇచ్చి రైతులను ఆదుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: