చేతిలో సెల్ ఉంటే చాలు అమ్మాయిల ప్రాణాలను మానాలను దోచేసుకుంటున్నారు మగ మృగాలు. నేటి సమాజంలో కామాంధులు తమ నేరాలకు సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్నారు. అందమైన అమ్మాయిలకు ఆంటీలకు వల వేయడం వారిని నమ్మించి శారీరకంగా వాడుకోవడం ఆపై బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను దన్నుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్క కామాంధుడు పాటించే ఏకైక సూత్రం. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ గణేష్ పురానికి చెందిన కాశీ అలియాస్ సుజి (26) ఇంజనీరింగ్ చదువుకున్నాడు. కానీ అతనికి ఏ ఉద్యోగం దొరకకపోవడంతో తన తండ్రి చికెన్ షాపులో పని చేయడం ప్రారంభించాడు.


ఖాళీ సమయంలో వ్యాయామశాల కు వెళ్లి బాగా కండలు పెంచేవాడు. వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఆడ వారిని ఆకర్షించేవాడు. ఎవరైనా మహిళలు అతని ఫోటోలను లైక్ చేసిన వెంటనే తాను వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి చాటింగ్ చేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి ఫోన్ నెంబర్లను సేకరించి తాను ఓ ధనవంతుడు కొడుకుని ప్రేమిస్తున్నానని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమాయకపు ఆడవారిని లొంగదీసుకుని శారీరకంగా వాడుకునేవాడు. తాను ఆడవారితో శృంగారం చేసే సమయంలో తన ఫ్రెండ్ అయిన డెసన్ జినో(19) రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసేవాడు.


ఈ తతంగమంతా పూర్తయిన తర్వాత కాశీ ఆ అమ్మాయిలకు తమ శృంగార వీడియోలు పంపించి తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడేవాడు. ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి పరువు తీస్తానని బెదిరించేవాడు. ఇలా పరువుకు తలంచిన ఎంతోమంది బాధిత అమ్మాయిలు అతడికి లక్షల రూపాయలను ఇచ్చేసారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కాశీ తన బాధితులకి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలంటూ వేధించేవాడు.


అయితే కొన్ని నెలల క్రితం చెన్నైకి చెందిన ఓ లేడీ డాక్టర్ తో పరిచయం పెంచుకున్న కాశి ఆమెను కూడా పెళ్లి అనే ఆశ చూపి... వలలో వేసుకొని తన కామ వాంఛను తీర్చుకున్నాడు. అది చాలదన్నట్టు తనకి 5 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయని చెప్పి ఆమె దగ్గర డబ్బులు దోచుకున్నాడు. ఐతే ఒకరోజు కాశీ ఫోన్ అనుకోకుండా చూసిన సదరు లేడీ డాక్టర్ కు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. ఆ మొబైల్ ఫోన్ లో కాశీ అనేక మంది అమ్మాయిలతో కలిసి శృంగారం చేస్తున్న వీడియోలు ఫోటోలు కనిపించాయి. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న లేడీ డాక్టర్ కాశీ ని నిలదీయగా... ఈ విషయం ఎవరికైనా చెబితే నీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని ఆమెను బాగా బెదిరించాడు.


ఈ దారుణమైన నిజాన్ని ఆమె జీర్ణించుకోలేక ఒకానొక రోజు నాగర్ కోవిల్ ఎస్పి కి ఈ మెయిల్ ద్వారా తనకు జరిగిన దారుణాన్ని చెప్పింది. విషయం తెలుసుకున్న ఎస్పి వెంటనే కాశీని, అతడి స్నేహితుడిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అతడి సెల్ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని అందులో ఉన్న అమ్మాయిల వివరాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఫోన్లో డాటాను బట్టి కనీసం 100 కంటే ఎక్కువ మంది కాశీ కి బాధితులైన ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే కాశీకి ఎవరైనా సహాయం చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: