తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అన్న సంగతి చాలామందికి గుర్తుండదు. ఎందుకంటే ఆ పార్టీ మనుగడలో ఉంది ఒక్క ఏపీలో మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం జాతీయ పార్టీగా చేసి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణకి అధ్యక్షుడుగా ఎల్ రమణ ఉండగా, ఏపీకి కళా వెంకట్రావు అధ్యక్షుడుగా ఉన్నారు.

 

అయితే ఈ ఇద్దరు పేరుకు మాత్రమే అధ్యక్షులు తప్ప, మిగతా పెత్తనమంతా చంద్రబాబు, చినబాబులుదే. కాకపోతే తెలంగాణలో పార్టీ ఎలాగో తుడిచిపెట్టుకుపోయింది. పైగా చంద్రబాబు కూడా తెలంగాణని పెద్దగా పట్టించుకోవడం లేడు. కాబట్టి ఎల్ రమణకు కాస్త అధ్యక్షుడు అన్న పేరు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏపీలో మాత్రం కళా వెంకట్రావుకు పేరుకు పదవి ఉందిగానీ ఆ విషయం ఎవరికీ తెలియదు.

 

అలాగే ఆయనకు అధ్యక్షుడన్న విలువ కూడా పెద్దగా లేదు. కాకపోతే అప్పుడప్పుడు ఆయన అధ్యక్షుడు హోదాలో మాట్లాడి..తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏపీ టీడీపీకి తానే అధ్యక్షుడుని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విమర్శలు చేసి, హైలైట్ అవ్వాలని చూస్తుంటారు.

 

తాజాగా కూడా ఆయన అదే ప్రయత్నం చేసారు. ఏపీలో మద్యం ధరలు పెంచడంపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ఓ వైపు మద్యం ఏరులై పారుతుంటే, మరో వైపు వైసీపీ మాత్రం మద్యం నియంత్రణకు విప్లవాత్మక మార్పులు తెచ్చామని ప్రకటనలు ఇవ్వటం సిగ్గుచేటని విమర్శించారు. అదేవిధంగా మధ్యం ధరలు పెంచి ప్రజల మీద రూ. 9 వేల కోట్ల భారం మోపారని అంటున్నారు.

 

అయితే వెంకట్రావు తాను అధ్యక్షుడు అనే చెప్పుకునే ప్రయత్నం బాగున్న,  మద్యం విషయంలో విమర్శలు చేయడంలో ఏ మాత్రం అర్ధం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ధరలు పెంచడం వల్లే మద్యం వినియోగం తగ్గుతూ వస్తుంది. అలాగే దశల వారీగా మద్యపాన నిషేధం చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుంది కాబట్టే, ప్రకటనలు ఇస్తున్నారు. మరి ఆ విషయం ఏపీ టీడీపీ అధ్యక్షుడుకు అర్ధం కావడం లేదనుకుంటా!

మరింత సమాచారం తెలుసుకోండి: