ప్రస్తుతం ఏపీలో మద్యం విషయంపై అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మద్యం ధరలు పెంచి పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటే, మద్యపాన నిషేధం చేయడంలో భాగంగానే అలా చేస్తున్నామని వైసీపీ చెబుతోంది. ఎక్కువ ధర పెంచితే, మద్యం కొనరని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ స్ట్రాటజీ ఏంటో తనకు తెలుసని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

 

ఒకచేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం జగన్ స్ట్రాటజీ అన్నారు. ఇక పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోరా? అని అడుగుతున్నారు. మద్యం ధరల పెంపుపై ఉత్సాహం చూపిస్తున్న సీఎం జగన్..కరోనా నివారణ చర్యలు, పేదలు, రైతులను ఆదుకోవడంలో చొరవ లేదని మండిపడుతున్నారు.

 

అయితే జగన్ స్ట్రాటజీ యనమలకు అర్ధం కాలేదని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఏదో విమర్శ చేయడానికే తప్ప,  యనమల చెప్పిన పాయింట్లలో లాజిక్ లేదంటున్నారు. అసలు మద్యం లెక్కల్లోకి వెళితే అదే అర్ధమవుతుందని, మద్యం ధరలు పెంచడం వల్లే, వినియోగం కూడా తగ్గిందని చెబుతున్నారు.

 

అదే విషయం జగన్ ప్రభుత్వం ప్రకటనల ద్వారా కూడా చెప్పిందని, ఇంకా షాపులు కూడా తగ్గించిందని అంటున్నారు. కాకపోతే లాక్ డౌన్ తర్వాత ఓపెన్ చేయడంతో మొదటిరోజు ఒక్కసారిగా మందుబాబులు ఎగబడ్డారని, అందుకే ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చిందని, తర్వాత రోజు నుంచి ఆదాయం పడిపోతుందని, దీని బట్టే అర్ధం చేసుకోవచ్చని, దశల వారీగా మద్యపాన నిషేధం సక్సెస్ అవుతుందని వివరిస్తున్నారు.

 

ఇక ఒక చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లాగేసిందో ఎవరో ప్రజలకు తెలుసని, టీడీపీ హయాంలో ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందో కూడా తెలుసని, అందుకే ప్రజలు ఆ అవినీతికి విసుగెత్తిపోయి, జగన్ ని భారీ మెజారిటీ గెలిపించారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: