చంద్రబాబు ఎపుడు ఎదుటి వారి మీదనే బురద జల్లుతారు. తప్పులెంచుతారు. తన గతం ఆయన పూర్తిగా మరచిపోతారు. వీలైతే అప్పటివీ, ఇప్పటివీ అన్నీ  కలిపి ప్రత్యర్ధులకే అంటించి మరీ మసాలా గట్టిగా దట్టించేస్తారు. దాంతో ఏది నిజమో అబద్దమో తెలియక జనం అయోమయంలో పడతారు. ప్రత్యర్ధి లాక్కోలేక, పీక్కోలేక అవస్థ పడతారు. బాబుకు కావాల్సింది ఇదే. ఇదే అసలైన బాబు చాణక్యం.

 

ఆ విధంగానే విశాఖలో ఎల్జీ పాలిమార్స్ లో గ్యాస్ లీకేజి ఘటనతో వైసీపీ సర్కార్ కి ముడిపెట్టేసి బాబుతో సహా తమ్ముళ్ళంతా చెలరేగిపోయారు. నిజంగా ఘటన జరిగిన తరువాత ముఖ్యమంత్రి జగన్ బాధితులకు భారీ ఆర్ధిక సాయం ప్రకటించారు. వారిని పరామర్సించారు తప్ప దీని  వెనక టీడీపీ ఉంది, గత సర్కార్ తప్పు చేసింది అని ఏమీ రాజకీయ విమర్శలు చేయలేదు. 

 

దాంతో బాబు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చిపోయారు. మొత్తం పాపం అంతా జగన్ దే అన్నట్లుగా బురద జల్లేశారు. జగనే విష వాయువులను దగ్గరుండి విశాఖకు  పంపించేశారని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మొదటి రోజు బాధితులకు భారీ సాయం ప్రకటించి భరోసా ఇచ్చి ప్రశంసలు అందుకున్న వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడింది. దాంతో సరైన మంత్రినే రంగంలోకి దించింది.

 

కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి అసలు ఎల్జీ పాలిమార్స్ తో బాబుకు ఉన్న తెర వెనక బంధమంతా చిట్టా చదివేశారు. హిందుస్థాన్ పాలిమార్స్ నుంచి  దక్షిణ కొరియా ఎల్జీ వారు పాలిమర్స్ ని కొనుగోలు చేయడం వెనక బాబు ఉన్నారని కూడా గుట్టు బయటపెట్టారు. ఆ కర్మాగారంలో 1998 నుంచి ప్రమాదాలు జరిగినా కూడా బాబు కనీసం పట్టించుకోలేదని కూడా బాణాలు ఎక్కుపెట్టారు. అంతే కాదు. 2108లో బాబు మరో అయిదేళ్ల పాటు ఆ పరిశ్రమ విస్తరణకు అనుమతులు ఇచ్చారని కూడా కధ మొత్తం చెప్పేశారు.

 

ఇక సింహాచలం భూములను సైతం డీ నోటిఫైడ్ చేసి మరీ పాలిమర్స్ ఇచ్చారని, వాటిని అప్పనంగా ఇవ్వడానికి బాబుకు ఉన్న ప్రేమ ఏంటని కూడా కొడాలి ప్రశ్నించారు. ఇపుడు విశాఖకు చెందిన మంత్రులంతా కూడా ఇదే విషయాన్ని గట్టిగా ఒకటికి పదిమార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో బాబు డంగైపోయారు. ఇక టీడీపీలో కూడా తమ్ముళ్ళు తగ్గిపోవాల్సివస్తోంది. మొత్తానికి ఒక విషాద ఘటనను సైతం రాజకీయం చేయాలనుకున్న  టీడీపీ తాను తీసిన గొయ్యిలో తానే పడిందని వైసీపీ నేతలు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: