భారతదేశంలో లాక్ డౌన్  అనేది భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కరోనా  వైరస్ ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్  విధించడంతో మరింత క్షీణించింది అనే చెప్పవచ్చు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  తొలగించడం కూడా భారత ఆర్థిక వ్యవస్థను మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. దీంతో వృద్ధిరేటు తీవ్రంగా పడిపోయింది. ఆరున్నర  శాతం వరకు వృద్ధి రేటు ఉంటుంది అని అనుకుంటుండగా.. భారతదేశం చైనా కంటే వృద్ధిరేటులో ముందు ఉంటుంది అనుకుంటున్న తరుణంలో మూడీస్ తాజాగా ఇచ్చిన అంచనాల ప్రకారం... ప్రస్తుతం భారతదేశానికి వృద్ధిరేటు సున్నా అని తాజాగా తేల్చేసింది

 


 ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు సున్నాగా నమోదు అవుతుందని... అదే సంవత్సరంలో వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరానికి మాత్రం 6.5 శాతానికి భారత వృద్ధిరేటు పెరుగుతుంది అని వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఏడాది ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని... ద్రవ్యలోటు లో భారతదేశం 5.5 శాతంగా ఉంటుంది అన్న అన్నటువంటిదే.. తాజాగా ఇచ్చినటువంటి అంచనా. గ్రామీణ  కుటుంబాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడి ... బలహీనమైన ఉద్యోగ కల్పన.. ఆర్థిక సంస్థల్లో నగదు కొరత లాంటి సమస్యలు కూడా వృద్ధి రేటు తగ్గడానికి కారణం అవుతాయి అన్న అటువంటిది మూడీస్  ఇచ్చినటువంటి నివేదిక . 

 

 అయితే గత నవంబర్లో మూడీస్ భారత్ కి బిఏఏ  2 రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక వృద్ధి రేటు కాస్త పూర్తిగా తగ్గిపోవడంతో ఆ రేటింగ్ ని నెగిటివ్ కి మార్చేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతూ ఉండటం కారణంగా... ప్రస్తుతం భారత దేశానికి ఈ సవాలు ఏర్పడిందని ఒకవేళ భారతదేశం సరిగా పుంజుకుంటే కనుక... సమర్థవంతంగా ముందుకు వెళ్లవచ్చని... ప్రస్తుతం ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే అన్ని వ్యవహారాలను ప్రభుత్వం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామూహిక వ్యవహారాలు లేకపోతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: