ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కట్టడి మాత్రం జరగడం లేదు. ఇక ఈ వైరస్కు ఎలాంటి విరుగుడు కూడా లేకపోవడంతో నివారణ ఒక్కటే మార్గం గా మారిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తికి ముఖ్య కారకుడు మనిషే  కాబట్టి.. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఈ మహమ్మారి వైరస్  వ్యాపించకుండా ఉండేందుకు.. సామాజిక దూరం తప్పనిసరి అనే ఒక నిబంధన విధించిన విషయం తెలిసిందే. 

 


 దేశంలోని ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని... సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా  వైరస్ను నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని సూచనలు సలహాలు ఇస్తున్నది  కేంద్ర ప్రభుత్వం. సామాజిక దూరం పాటించేందుకు  పలు చర్యలు కూడా చేపడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనిని  అందరూ అభినందిస్తున్న విషయం తెలిసిందే. సినీ రాజకీయ క్రీడా రంగ ప్రముఖులు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టండి అంటు  సూచిస్తున్నారు. 

 

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం సామాజిక దూరం అనేది కేవలం మైనారిటీలను దూరం చేయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది అంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. షకీల్ ఖురేషి అనే వ్యక్తి ఈ విధమైన పిటిషన్ను సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో  దీనిపై సరైన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు...  ఇలా కుల మత ప్రస్తావనను  ఊరికే తెచ్చే వారికి చెంపపెట్టులా సరిగ్గా స్పందించింది. సామాజిక దూరం అనేది కేవలం మైనార్టీలు మాత్రమే పాటించడంలేదని హిందూ ముస్లిం అనే తేడా లేకుండా దేశ ప్రజలందరూ పాటిస్తున్నారని ఇలాంటి మతపరంగా  రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ 10 వేల జరిమానా విధించింది సుప్రీంకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: