ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది  విశాఖ నగరం. ఓ వైపు సముద్రపు అలల సవ్వడి... ప్రశాంతమైన గాలితో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నగరం. అలాంటి ప్రశాంతమైన నగరంలో ప్రస్తుతం ప్రజల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ముందుకు వెళ్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి అన్నట్లుగా  మారిపోయింది అక్కడి ప్రజల పరిస్థితి. అప్పటికే కరోనా  వైరస్ బారిన పడి తీవ్ర భయాందోళనలో  బతుకుతున్నారు విశాఖ  ప్రజలు . అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి భారీ మొత్తంలో విష వాయువు  లీక్ అయిన విషయం కారణంగా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారూ . 

 


 ఈ ఘటన దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది అన్న  విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా విషవాయువు భారీ మొత్తంలో లీక్ కావడంతో ఏకంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని గ్రామాలకు గ్రామాలను తరలించిన విషయం తెలిసిందే. దీంతో పలు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా గ్రామాలు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటు విష వాయువు నుంచి తప్పించుకోవడం ఏమో కానీ.. అటు  ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్ బారిన ఎంతమంది పడ్డారో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష వాయువు ఒకసారి వ్యాపించడంతో గుంపులుగుంపులుగా గ్రామాల ప్రజలు అందరూ వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. 

 

 ఈ క్రమంలోని అంతమందిలో ఎవరికైనా కరోనా  లో వైరస్ సోకి ఉంటే అది ఎంత మందికి అంటుకుని ఉంటుంది  అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇదే సమయంలో అటు లాక్ డౌన్ సడలింపు కూడా కొనసాగుతుండడం ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తుండడం.. అంతేకాకుండా కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వేరే జిల్లాలకు కూలీలు  వెళ్తున్నారూ.  ఇలాంటివి జరుగుతూ ఉండటం కారణంగా.. విశాఖ వాసులకు పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఇటు ప్రాణాలు తీసే విష వాయువు నుంచి తప్పించుకోవాల.. లేదా అటు మహమ్మారి కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాల అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: