దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు 40 రోజుల పాటు లాక్ డౌన్  విధించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సడలింపులు ఇస్తూన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం  తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పలు కార్యకలాపాలకు అనుమతిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రస్తుతం భవన నిర్మాణాలు రోడ్డు నిర్మాణాలు ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు  ప్రస్తుతం తొలి దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యయి.  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ పనులను ప్రారంభించింది. 

 

 ఇదిలా ఉంటే... ఆ మధ్య కాలంలో గుడికి వెళ్లి వచ్చినప్పుడు అక్కడ ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో  గుడి కట్టేస్తున్నారు అంటూ కొంతమంది ఆరోపణలు చేశారు. మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే అయోధ్య వివాదాస్పద విభాగంలో ప్రస్తుతం ఆలయం నిర్మిస్తే  మైనార్టీలు రెచ్చిపోవాల్సిన  అవసరం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ముస్లింలకు కూడా మసీదు కు సంబంధించి భూమి ఇచ్చిన తర్వాతనే ప్రస్తుతం రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

 


 అయితే అయినప్పటికీ కొంతమంది మాత్రం కావాలని మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా రెచ్చగొట్టాలని కొంత మంది   చూస్తున్నారని  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజల  మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. తబ్లిగ్ సమావేశం వళ్ల  కరోనా  వైరస్ వస్తుంది అని ఆరోపణలు చేసినప్పుడు ట్రంప్  విదేశాల నుంచి రాలేదా.. కానీ ప్రస్తుతం కావాలని తబ్లిక్ సమావేశం పై ఆరోపణలు చేస్తున్నారంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం భారతీయులందరికీ తెలుసు తబ్లిక్  సమావేశం కారణంగానే భారతదేశంలో ఎక్కువగా వైరస్ వ్యాప్తి జరిగింది అన్న విషయం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: