ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో దాదాపుగా దేశ సరిహద్దుల్లో అన్ని ఎగుమతులు దిగుమతులు రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాకుండా దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోకేంద్ర  ప్రభుత్వం  పలు చర్యలు తీసుకుంటూ ప్రజలకు ప్రయోజనం దృశ్య పలు కార్యక్రమాలు చేపడుతున్నది .ఆయా  సరిహద్దుల్లో ఒకటికొకటి పరిస్థితులు మార్చుకుంటున్నారు. ఇప్పటికే భారతదేశ చైనా సరిహద్దుల్లో గతంలో చైనా వద్దుఅన్నట్టుటువంటి స్థలంలో ప్రస్తుతం భారత్ టన్నెల్ నిర్మించింది . 

 

 ప్రస్తుతం ఈ టన్నెల్  ద్వారా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంది.ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ టన్నెల్  రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం మరో ప్రక్రియకు సంబంధించి కూడా వార్తలు వెలువడుతున్నాయి. భారత్ నుంచి మానస సరోవరానికి వెళ్ళడానికి దాదాపుగా రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. అయితే మానససరోవరానికి వెళ్లే భక్తులు అందరూ పూర్తిగా పర్వత  మార్గం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలెన్నో ఉన్నాయి. 

 


 దీంతో యుద్ధ ప్రాతిపదికన దార్చులా నుండి లీపు లేక్ లో రోడ్డు  నిర్మాణం ప్రారంభించారు. యాత్రికుల కోసం ప్రత్యేకంగా 17500 మీటర్ల ఎత్తులో 80 కిలోమీటర్ల రోడ్డు ని ప్రస్తుతం నిర్మించారు. ఇక ఈ రోడ్డు నిర్మాణం అనుకున్న సమయం కన్నా ముందుగానే పూర్తయినట్లు తెలుస్తోంది. దీనిని  కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన లింకు రోడ్లు సెట్ చేయాల్సి ఉంది. కాగా ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ప్రస్తుతం కొంత వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇది కేవలం వెహికల్ ట్రాన్స్ పోర్ట్ కు మాత్రమే అనుమతిస్తారా  నడకదారి కి పనికి వచ్చేలా కూడా నిర్మించారా  అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: