దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సరైన మార్గమని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఇక లాక్ డౌన్ కారణంతో వలస కార్మికులకు ఉపాధి లేక పోవడంతో వారు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక వాళ్ళు ఊళ్లకు వెళ్లేందుకు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వాలు రైలు బస్సుల సౌకర్యాలు కల్పిస్తున్నా కానీ కొందరు వలస కార్మికులు మాత్రం వాటిని పట్టించుకోకుండా వారి తరుణంలో వాళ్లు ఇళ్లకు వెళ్ళేటందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

 


ఇకపోతే వారంతా సొంత ఊర్లకు చేరుకుంటే చాలు అన్నా ఆత్రుతతో ప్రభుత్వాలపై ఎటువంటి ఆధారపడకుండా వాళ్ల నడుచుకుంటూ లేదా సైకిళ్లపై వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాగే తన సొంత ఊరుకు చేరుకోవాలన్న ఆతృతతో కాలినడకన బయలు దేరిన ఒక మహిళ... నేడు పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని సాత్నాకు చెందిన శకుంతల నిండు గర్భిణీ. 

 


అయితే లాక్ డౌన్ దృష్ట్యా ఆమె నాసిక్ నుంచి సాత్నాకు తన కుటుంబంతో కలిసి బయలుదేరడం జరిగింది. దాదాపు ఆ మహిళ రెండు వందల కిలోమీటర్లు నడిచి ధూలే గ్రామానికి చేరుకున్నాక ఆమెకు పురిటి నొప్పులు రావడం జరిగింది. ఆమెతో కలిసి ప్రయాణం కొనసాగిస్తున్న మహిళలు ఆమెను రోడ్డుపక్కనే చీరలతో కట్టి గుడిసెలోకి తీసుకుని వెళ్లి ప్రసవానికి చేసేందుకు సహాయ పడటం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న బర్వానీ అధికారులు.. మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. వారందరూ కూడా వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్సు సౌకర్యాలు కల్పించడం జరిగింది. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరకి రాకూడదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: