భారతదేశంలో కొంతమందికి విదేశాలపై  అమితమైన ప్రేమ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారతదేశాన్ని ప్రేమించినట్లు గానే విదేషాలను కూడా ప్రేమించడం తప్పేమీ కాదు. కానీ విదేశాలను  ప్రేమించి భారతదేశంను మాత్రం ద్వేషించడం మాత్రం దేశద్రోహం అవుతుంది. ప్రస్తుతం ఇలాంటిది భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. భారత దేశాన్ని ప్రేమించడం కాదు భారత దేశాన్ని ద్వేషిస్తూ భారత దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ప్రేమిస్తున్న వారు  ఎక్కువై పోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 


 ఇలా సొంత దేశాన్ని ద్వేషిస్తూ ఇతర దేశాలను  ప్రేమిస్తూ ఆయా దేశాలకు సపోర్ట్ చేయడం భారతదేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ అవమానిస్తూ  అన్యాయం చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా అలనాటి స్టార్ హీరోయిన్ అయిన నగ్మా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం సంచలనం సృష్టించింది. అయితే నగ్మా కమలహాసన్ లాంటి సినిమా నటులు భారతదేశం విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం నిజంగా బాధాకరం అంటున్నారు విశ్లేషకులు. 

 


 పాకిస్తాన్ కు సంబంధించినటువంటి జర్నలిస్టుపై  డిబేట్లో ఇక్కడున్న ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మాట్లాడకూడదని అది పూర్తిగా అన్యాయం అన్నట్టుగా వీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళని ఎందుకలా దబాఇస్తూ నిలదీస్తారు అంటూ ఏకంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఆనాటి స్టార్ హీరోయిన్ నగ్మా. అయితే పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ కు మద్దతు గా మాట్లాడుతున్నాడు కానీ మన దేశం విషయానికి వచ్చేసరికి మన దేశాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్న పాకిస్తాన్ కి మద్దతుగా భారతీయులు కూడా మాట్లాడుతుండటం  దురదృష్టకరం అంటున్నారు . పాకిస్తాన్లోని ప్రతిపక్షం అధికార పార్టీలు కలిసి భారత్ పై విమర్శలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు అంటున్నారు. విదేశాలను  ప్రేమించి భారతదేశంను మాత్రం ద్వేషించడం మాత్రం దేశద్రోహం అవుతుంది అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: