కరోనా వైరస్ తో బిక్కుబిక్కుమంటు బతుకుతున్న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి వచ్చిన విషవాయువులు విశాఖ వాసులను మరింత భయపెట్టడం జరిగింది. తెల్ల తెల్లవారు జామున కొన్ని రోజులపాటు నిల్వ ఉంచిన స్టెరీన్ గ్యాస్ లీక్ అవడంతో ఆవిరి బయటకు రావడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రపోతున్న వాళ్లకు ఏమవుతుందో తెలియకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ స్పృహతప్పి ఊపిరాడక పడిపోవటం వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూడటం జరిగింది. స్టెరీన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఆవిరి బయటకు రావడంతో ఈ భారీ ప్రమాదం జరగటం మనకందరికీ తెలిసిందే. ప్రమాదకరమైన ఈ గ్యాస్ వల్ల 12 మంది చనిపోగా కొన్ని వందలాది మంది హాస్పిటల్ పాలయ్యారు.

 

అయితే ఊరి మధ్య ఉన్న ఈ కంపెనీ పై తర్వాత రోజు వైజాగ్ వాసులు దాడులకు పాల్పడటం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో పాటు ప్రభుత్వం తక్షణమే ప్లాంటును మూసివేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. పరిస్థితి చాలా ఉద్రిక్తత గా ఉండటంతో జగన్... ఎల్జీ పాలిమర్స్ సంస్థ పై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైజాగ్ లో రాజధాని పెట్టాలని జగన్ దృఢసంకల్పంతో ఉండటంతో...ఎల్జీ పాలిమర్స్ సంస్థ తీసివేయాలని దానికి సంబంధించి న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఎప్పటి నుండో వైజాగ్ లో ఉండటంతో పాటు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి కంపెనీ ఊరు శివారులో అప్పట్లో స్థాపించడం జరిగిందట. దీంతో జగన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ వాళ్లు అంతర్జాతీయస్థాయి న్యాయస్థానంలో కేసు వేస్తే జగన్ ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ సందర్భంగా జగన్ న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: