ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న  కరోనా మహమ్మారి వల్ల  అనేక మంది బాధపడుతున్నారు. అయితే ఈ మహమ్మారి భారత దేశంలోకి వ్యాపించకూండా  దేశ‌వ్యాప్తంగా మన  ప్రధాని లాక్ డౌన్ అమలుచేశారు. కానీ ఎంత పటిష్టంగా లాక్ డౌన్ అమలుచేసి, ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ బారిన పడే వారి సంఖ్య ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. దీనితో రెండో విడత లాక్ డౌన్ అమలుచేశారు.. అయినాగానీ ఈ మహమ్మారి మనల్ని, మనదేశాన్ని వదలలేదు.దీనితో మూడో విడ‌త లాక్‌డౌన్‌ ను అమలుచేసింది.. దీనిలో  భాగంగా కేంద్రం అనేక ఆంక్ష‌ల‌కు స‌డ‌లింపులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వైరస్ వ్యాప్తిని భట్టి  దేశంలో గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లో ప‌లు కార్య‌క‌లాపాలు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి.

 

అయితే ప్రభుత్వం ఇటీవ‌లే మ‌ద్యం షాపుల‌కు కూడా అనుమ‌తిచ్చారు.దీనితో ప్రజలు ఆంక్షలు పక్కనపెట్టి విచ్చలవిడిగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతోపాటు ప‌లు ఫ్యాక్ట‌రీలు, పరిశ్ర‌మ‌లు, వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాలను తెరిచేందుకు కూడా అనుమ‌తులు ఇచ్చారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు మ‌ళ్లీ య‌థాప్రకారం రోడ్ల‌పైకి రావ‌డం మొద‌లు పెట్టారు..దీనితో వైరస్  మళ్ళీ వ్యాప్తి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైరస్ విజృంభణ అధికంగా గా ఉన్న  ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‌లో ఇటీవ‌లే లాక్‌డౌన్ అనంత‌రం ప‌లు ఆంక్ష‌ల‌కు స‌డ‌లింపులు ఇచ్చారు. అక్క‌డ కూడా వ్యాపార వాణిజ్య స‌ముదాయాలు, బార్లు, క్ల‌బ్బులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సెంట‌ర్లు ఓపెన్ అయ్యాయి. అయితే గ‌త 2, 3 రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపుగా 50కి పైగా క‌రోనా కేసులు ఒక్క సియోల్ చుట్టు ప‌క్క‌లే న‌మోద‌య్యాయి. అలాగే ఆదివారం ఒక్క రోజే 34 మందికి కొత్త‌గా కరోనా సోకింది. దీనితో మళ్ళీ అక్కడ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

 

 అయితే  మన భారత దేశములోను  కొన్ని చోట్ల మాత్రం జ‌నాలు ఇంకా విన‌డం లేదు. సామూహిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతోపాటు అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు వ‌చ్చి ట్రాఫిక్ జాంల‌ను సృష్టిస్తున్నారు. అలాగే కొంతమంది ఎటువంటి మాస్క్ ధరించకుండా విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కనీస భౌతిక దూరం కూడా పాటించడంలేదు.  ఈ క్ర‌మంలో క‌రోనా మ‌ళ్లీ తిర‌గ‌బెట్టి.. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లోనూ సెకండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని హెచ్చరిక చేస్తున్నారు.. ఇన్నాళ్లు కష్టపడి ప్రజలు ఇంటికే  పరిమితం అయి ఉన్నాగాని ఫలితం లేకుండా పోతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: