కేరళలో ఈరోజు కరోనా కేసులు స్వల్పంగా పెరిగినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించారు. గత 6రోజుల నుండి కేవలం 4 కేసులు మాత్రమే నమోదు కాగా ఈరోజు మాత్రం కొత్తగా 7కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురువిదేశాల నుండి వచ్చిన  వారు  కాగా నాలుగు కాంటాక్ట్ కేసులు. ఈ కొత్త కేసుల తో కలిపి కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 512కు చేరింది అందులో 489 మంది బాధితులు కోలుకోగా ముగురు మరణించారు. ప్రస్తుతం 20కేసులు యాక్టీవ్ గా  వున్నాయి. 
ఇక సౌత్ లోని మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూవున్నాయి. తమిళనాడులో ఈరోజు 669 కేసులు నమోదు కాగా ఒక్క చెన్నై లోనే 509 కేసులు బయటపడడం గమనార్హం అలాగే కర్ణాటక లో ఈరోజు  54 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 848 కుచేరింది. మద్యం షాపులు తెరిచినప్పటి నుండి ఆ రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్తగా 50 కేసులు నమోదు కాగా  తెలంగాణ లో మరో 33 కేసులు నమోదయ్యాయి. మరో వారం రోజుల్లో మూడో దశ దశ లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: