కరోనా వైరస్ ప్రపంచంలో ఉన్న ప్రధానిని మొదలుకొని పేదవాడి నీ వరకు చాలా గట్టిగా భయపెట్టింది. ఎవరూ కూడా ఇల్లు వదిలి బయటకు రాని పరిస్థితి క్రియేట్ చేసింది. కరోనా వైరస్ రాకముందు వరకూ ప్రపంచం హడావిడిగా ఉంటూ ఎక్కడికక్కడ పండగల వాతావరణం లా ఉంటే కరోనా వైరస్ వచ్చాక మాత్రం మనిషిని మనిషి ముట్టుకోవడానికి భయాన్ని కలిగించింది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పేదవారిని ఆదుకునే విధంగా ఉన్నాయి. ఎలా అంటే పెళ్లి అంటే ఒక టైంలో అనగా కరోనా వైరస్ రాక ముందువరకు పెళ్లి చేయటం కోసం అనేక అప్పులు చేసేవాళ్ళు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న విధంగా పెళ్లి ఖర్చు ఉంటుందని సామెత మనకందరికీ తెలిసినదే. కరోనా వైరస్ వచ్చాక ప్రభుత్వాలు పెళ్లిళ్ల విషయంలో రూల్స్ కొన్ని ఇవ్వటం జరిగింది.

 

అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే బంధువులకు శుభలేఖలు పిలుపు ఇవ్వడం జరిగినది. అయితే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకోవాలంటే ముందుగా అధికారులకు అప్లికేషన్ పెట్టుకోవాలి. రెవెన్యూ విభాగంలో ఎమ్మార్వో గారికి తొలుత అప్లికేషన్ పెట్టుకుంటే వారు అన్ని విషయాలను పరిశీలించి ఓకే చెబితేనే పెళ్లి అవుతుంది. దానికి మించి ఏ మాత్రం తేడా చేసినా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో అమ్మాయి తరఫున మరియు అబ్బాయి తరఫున పెళ్లి కి వచ్చే వారి వివరాలు ప్రతి ఒక్కరు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

 

అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కులు ధరించి పెళ్లికి హాజరు కావాల్సి ఉంటుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకుంటాను అని హామీ పత్రం పై సంతకం చేయాలి. అలా జరిగితేనే పెళ్లికి అనుమతి ప్రభుత్వం నుండి వస్తుంది. సో ఇటువంటి టైములో పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అర్జెంటుగా ప్రభుత్వానికి అప్లికేషన్ పెడితే చాలా బెటర్. ఖర్చు తక్కువ అవుతుంది పైగా 40 మంది సభ్యులు కాబట్టి పెళ్ళికి వచ్చే వారికి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఘనంగా పెళ్లి చేసుకున్నట్లు అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: