ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... కరోనా కేసుల సంఖ్య మాత్రం క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతూనే ఉంది. వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో అతి తక్కువ కేసులు నమోదు అయిన ప్పటికీ.. ఆ తర్వాత కాలంలో మాత్రం రోజురోజుకూ ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఈ మహమ్మారి వైరస్ కు వ్యాపకం  మనిషి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తి మనిషి కావాలని చేయడం లేదు...వైరస్  బారిన పడిన సదరు వ్యక్తి లో వైరస్ లక్షణాలు కనిపించక పోవడంతో అతడు యదేచ్ఛగా ఎప్పటిలాగే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు . కానీ ఆ వ్యక్తి ద్వారా కొంత మందికి ఆ కొంతమంది ద్వారా ఎంతో మందికి ఈ వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

 

 

 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో  పరిస్థితి రోజురోజుకూ దుర్భరంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. క్రమక్రమంగా ఆయా జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ప్రజలు ఈ వైరస్ వ్యాప్తి విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండి ఎంతగా ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... వేరొకరి తప్పు కారణంగా మరొకరు వైరస్ బారిన పడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. 

 

 

 అయితే కొంతమంది నిర్లక్ష్యమే ఎంతోమందికి కరోనా వైరస్ రావడానికి కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే రాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా  వైరస్ ఎక్కువగా వ్యాప్తి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ నలభై మందిని సూపర్ స్పైడర్ గా పేర్కొన్నారు అధికారులు. ఈ 40మంది ద్వారా సుమారు 300 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు అని గుర్తించారు అధికారులు. ఇక ఈ నలభై మంది నుంచి ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు ముందస్తు  జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు కృష్ణ గుంటూరు అనంతపురం ప్రకాశం  జిల్లాల్లో  ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: