లాక్‌డౌన్ నేపధ్యంలో ఎప్పుడెప్పుడు వైన్స్ షాపులు ఒపెన్ అవుతాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన మందుబాబుల కలలు ఎట్టకేలకు నిజమయ్యాయి.. ఒకరకంగా ప్రపంచాన్నే జయించినంత ఆనందగా ఉన్నారు మద్యం ప్రియులు.. దోరిన వారు దొరికినంతగా తమ గొంతులు తడుపు కుంటున్నారు.. అయితే ఇదే మంచి సమయమని కల్తీ మద్యం కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.. అంతే కాకుండా ఆ మద్యంలో చచ్చిన ఎలుకలు, బల్లులు, కప్పలు కనిపిస్తే.. ఒక వేళ చూడకుండా తాగితే ఆ తాగుబోతుల పరిస్దితి ఏంటి..

 

 

అయినా ఇలా వచ్చే చాన్స్ లేదంటారా.. అయితే ఈ మ్యాటర్ చదవండి.. ఎందుకంటే  మద్యం సీసాలను కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులకు ఒక రమ్‌ బాటిల్లో చచ్చిన కప్ప కనిపించింది అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి.. చెన్నై,టీ.నగర్ లోని మైలాడుదురై జిల్లా, శీర్గాళిలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఇకపోతే వివరాలు ఆదివారం బయటకు వచ్చాయి.. తెన్‌పాదికి చెందిన కొందరు, శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్‌ షాపులో శుక్రవారం సాయింత్రం మద్యం కొనుగోలు చేశారు.  

 

 

సంతోషంగా వారి పొలంలోకి వెళ్లి ఎంజాయ్ చేద్దామని బాటిల్‌ తెరిచి చూడగా.. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించగా మందుతాగుదామనే మూడు పాడై వెంటనే అదికొన్న షాపు యజమాని దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వారు ఈ సమాచారం బయటకు పొక్కకుండా వారిని కవర్ చేసినట్లుగా తెలిసింది.. ఇకపోతే మద్యం సీసాలో కప్ప కనిపించడం గురించి జిల్లా టాస్మాక్‌ మేనేజర్‌ అంబికాపతిని ప్రశ్నించగా ఇంతవరకు తమ దృష్టికి ఈ సమాచారం అందలేదని, పూర్తిగా పరీక్షలు జరిపిన తరువాతే మద్యం బాటిళ్లను విక్రయాలకు అనుమతిస్తున్నస్తున్నట్టు తెలిపారు.. ఓ మందుబాబులు చూసారా.. దొరికింది కదా అని చీకట్లో మందును గొంతులోకి పోసే ముందు కాస్త ఆలోచించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: