ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెరుగుతుండ‌గా...కొద్దిరోజుల క్రితం వ‌ర‌కు కూడా రోజూ వేలాది కేసులు న‌మోదైన ఇటలీలో క్ర‌మంగా త‌గ్గ‌ముఖం ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.  ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన వివ‌రాల‌ ప్రకారం, ఆదివారం సాయంత్రంతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 802 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. గ‌తంలో నమోదైన కేసుల సంఖ్య‌తో పోల్చుకుంటే కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి.  మార్చి మాసం  ప్రారంభంలో ఇట‌లీ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రారంభమైంది.  

 

దీంతో అక్క‌డ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  అయితే ఆ త‌ర్వాత ఏప్రిల్ మాసంలో మాత్రం క‌రోనా విల‌యం సృష్టించింది. అయితే ఇ​టలీలో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన లాంబార్డీ ప్రాంతంలో కఠిన నిర్బంధం అమలు చేస్తుండటంతో వైర‌స్ ఉధృతి త‌గ్గింద‌ని అధికారులు తెలిపారు.  గ‌డిచిన  24 గంటల్లో లాంబార్డీలో కేవ‌లం 282 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే న‌మోదు కావడం గ‌మ‌నార్హం.  ఇక దేశ వ్యాప్తంగా న‌మోదైన కేసుల సంఖ్య‌ను ప‌రిశీలిస్తే  1,000 కంటే తక్కువ ఉండ‌టం విశేషం. గ‌డిచిన రెండు మాసాల్లో కూడా ఇంత త‌క్కువ స్థాయిలో క‌రోనా   కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

 

ఇక  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,19,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం విశేషం. శనివారం సాయంత్రం నుంచి గడిచిన 24 గంటల్లో 165 మంది  క‌రోనాతో చనిపోయారు. దీంతో కరోనా కారణంగా ఇట‌లీలో మృతిచెందిన వారి సంఖ్య  30,560కు పెరిగింది. ఇదిలా ఉండ‌గా ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41 లక్షలు దాటిపోగా.. 2,83,868మంది మ‌ర‌ణించారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: