దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 4000 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై వైరస్ పంజా విసురుతోంది. లాక్ డౌన్, భౌతిక దూరం వల్ల కరోనాను కొంతమేర నియంత్రిస్తున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను పూర్తిస్థాయిలో  నియంత్రించడం సాధ్యమవుతుంది. కరోనా దెబ్బకు ప్రపంచం అంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది. 
 
ప్రంపంచం అంతా వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని భావిస్తోంది. ఇతర దేశాల అధ్యక్షులు సైతం కరోనాకు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని బలంగా విశ్వసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కంపెనీలు వ్యాక్సిన్ ను కనిపెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కనిపెట్టలేకపోతే ఏం జరగబోతుందనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. 
 
వ్యాక్సిన్ కనిపెట్టినా వ్యాక్సిన్ సమర్థంగా పని చేయకపోతే ఏం చేయాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ బీ అమలు చేయాలని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. గతంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వైరస్ లకు అడ్డుకట్ట వేశాం. కానీ కరోనాకు వ్యాక్సిన్ లేకపోతే మన జీవితం మునుపటిలా ఉండే అవకాశం లేదు. 
 
కరోనా నిర్ధారణ పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ మన జీవితంలో భాగమయ్యే అవకాశం ఉంది. 1984 లో శాస్త్రవేత్తలు కనుగొన్న హెచ్.ఐ.వీ వైరస్ కు ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధిని అదుపు చేసే వ్యూహాలు రచించాలి. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే వారు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలి. ఎవరైనా అనారోగ్యం భారీన పడితే వారికి సంస్థలు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాలి. ప్రజలు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే ప్లాన్ బి కి కూడా సిద్ధంగా ఉండాలని 

మరింత సమాచారం తెలుసుకోండి: