మృత్యువు ఎప్పుడూ అనుకోని విధంగా వస్తూ ఉంటుంది. ఏ రూపంలో మృత్యువు వస్తుందో అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యకరంగా కూడా  ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సెల్ఫోన్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా సెల్ఫోన్ వాడుతూ అవి వేడెక్కడం ద్వారా ఒక్కసారిగా పేలడంతో  ప్రాణాలు కోల్పోతున్న వారూ కొంత మంది అయితే... సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టే  చార్జర్ ద్వారా కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్న వారూ  ఇంకొంతమంది. రోజురోజుకు సెల్ఫోన్ల ద్వారా చనిపోతున్న వారి సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. 

 

 

 రోజురోజుకు సెల్ఫోన్ కంపెనీలు నాణ్యత లోపం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. ప్రస్తుతం సెల్ ఫోన్ వాడకం ఒక మనిషి జీవితం లో నిత్య అవసరంగా మారిపోయిన..  నేపథ్యంలో మనిషి సెల్ఫోన్ లేకుండా ఉండలేక పోతున్నాడు. కొంతమంది కేవలం అవసరం కోసం మాత్రమే సెల్ఫోన్ వాడుతుంటే ఇంకొంతమంది అవసరానికి మించి దాదాపుగా రోజులో 24 గంటలూ ఆ సెల్ ఫోన్ తోనే కాలం గడుపుతున్నారు. ఇలా రోజురోజుకు మనిషి జీవితాన్ని సెల్ఫోన్ ఎంతగానో ప్రభావితం చేస్తోంది. 

 

 

 తాజాగా ఆ సెల్ఫోన్ ఛార్జింగ్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్ రావడం వల్ల వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణ లో చోటు చేసుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి.. సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడంతో ఛార్జింగ్ కేబుల్ లో చార్జింగ్ పెట్టాడు. ఇక ఇలా ఛార్జింగ్ పెడుతున్న సమయంలోనే కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మేకల కనకయ్య మరణంతో కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: