ప్రపంచంలో కరోనా వైరస్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ క్రమంగా ప్రపంచంలోని ప్రతి దేశానికి పాకింది. దీంతో ఏకంగా ప్రస్తుతం 40 లక్షలకు పైన దీని బారిన పడ్డారు. అంతేకాదు ప్రపంచం మొత్తంలో మూడు లక్షలకు దగ్గరగా జనం చనిపోయారు. ఎక్కువగా దీని వ్యాప్తి ప్రపంచంలో అమెరికాలో ఉంది. ఇక ఆ తర్వాత యూరప్ దేశాలు అయిన స్పెయిన్, ఇంగ్లాండు, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, టర్కీ, ఇరాన్ దేశాలలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆయా దేశాల్లో కనీసం 20 వేల మంది పైన చనిపోయారంటే నమ్మండి.


ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక అమెరికా దేశం విషయానికి వస్తే... నేటితో ఆ దేశంలో ఎన్నో వేల మంది పైన చనిపోయారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 13 లక్షల 65 వేల మంది పైన ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఇందులో నుంచి దాదాపు రెండున్నర లక్ష మందికి పైగానే దీనినుంచి జయించారు. ఇక కేవలం గత 24 గంటల్లో ఆ దేశంలో 876 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల వరకు ఆ దేశంలో రోజుకి రెండు వేల వరకు జనాభా మరణించారు. అయితే కాస్త ప్రస్తుతం తగ్గినప్పటికీ  మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలో మరణాల రేటు 5.9 శాతంగా ఉంది.


ప్రపంచంలో ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 40 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల మరణాల రేటు 6.9 శాతంగా ఉంది. ఏది ఏమైనా ఈ వైరస్ వల్ల ప్రపంచం ఒక గుణపాఠం నేర్చుకున్న సంగతి చెప్పవచ్చు. ఈ వైరస్ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ విషయంలో భారత్ కొద్దిగా స్థిరంగానే ఉన్నా అమెరికా, యూరప్ దేశాలు మాత్రం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దీని వల్ల అమెరికాలో కొన్ని లక్షలమంది నిరాశ్రయులు కాగా ఎంతమంది వారి ఉపాధిని కోల్పోయారో ఇంకా ఒక లెక్క తేలలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: