వ్యక్తిగత రక్షణ కోసం మనదేశంలో కొంతమంది వాళ్ళ దగ్గర ప్రభుత్వం అంగీకారంతో లైసెన్ ఉన్న తుపాకీలు, వెపన్స్ వాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సవరణలు అమలుచేయనుంది. అయితే మన దేశంలో అనేక అంశాల్లో మార్పులు చేర్పులూ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశంలో వ్యక్తిగత ఆయుధాల వాడకం పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్లు IPS ఆఫీసర్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.


స్వీయ రక్షణ కోసం ప్రజలు తమ వద్ద ఉంచుకునే ఆయుధాలను 3 నుంచి రెండుకు తగ్గించారన్నారు. స్వీయ రక్షణ కోసం మూడు ఆయుధాలను తమ వద్ద ఉంచుకోవచ్చని 1983లో ఆయుధాల చట్టానికి సవరణలు చేశారు. కాగా దాన్ని ఇప్పుడు తగ్గించారు. ఇకనుంచి ఎవరికయినా సరే వ్యక్తిగత రక్షణ కోసం రెండు ఆయుధాలనే అనుమతిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో రక్షణ వ్యవస్థలు చాలా బలపడ్డాయి. అలాగే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు  ఉగ్రవాద, దోపిడీ చర్యలు చాలా వరకూ తగ్గాయి. ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తు అమలులో ఉందని తెలిపారు. అందుకని ఎవరు బయపడాలిసిన పని లేదు అని వివరణ ఇచ్చారు. 

 


అందుకనే ఏ వ్యక్తుల దగ్గర అయినా ఎక్కువ సంఖ్యలో గన్స్, రివాల్వర్ల వంటివి ఉండటం కరెక్టు కాదని కేంద్రం భావించి ఇలా  ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్లు తెలిసింది. ఎవరిదగ్గరైనా రెండు కంటే ఎక్కువ ఆయుధాలు ఉంటే వాటిని తిరిగి ఇచ్చేయాలని తెలిపారు. ప్రధానంగా  కొంతమంది రాజకీయ నాయకులు, వీఐపీలు, వ్యాపారవేత్తలు తమ రక్షణ కోసం లైసెన్స్డ్ వెపన్స్ తమ దగ్గర  ఉంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరిదగ్గర అయితే  రెండుకంటే ఎక్కువ ఆయుధాలు ఉంటాయో వాళ్ళు రెండు మాత్రమే ఉంచుకొని,  మూడు గాని అంతకంటే ఎక్కువగాని ఉంటే త్వరగా  పోలీస్ శాఖను సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోవాలని తెలిపారు. అయితే ఈ చట్టం పటిష్టంగా అమలు అయ్యేటప్పటికి వీలయినంత తొందరగా ఎక్కువ ఆయుధాలు ఉంటే వదిలించుకోవడం మేలు. లేదంటే ఆయుధాల చట్టం కింద కటకటాల పాలు అయ్యే  ప్రమాదం ఉంటుంది అని వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: