మద్యం సేవించ వద్దని నలుగురికి చెప్పాల్సిన పోలీసు అధికారులే మద్యం తాగుతూ అడ్డంగా బుక్కయ్యి రాష్ట్ర వ్యాప్తంగా అందరి చివాట్లు అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కమిషనరేట్ పరిధిలో డ్యూటీ లో ఉండి పూర్తి నిర్లక్ష్యం చూపిన ముగ్గురు పోలీసులు పై పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నాడు. గన్నవరం లో డ్యూటీ చేస్తున్న ఇద్దరు ఆర్మడ్ రిజర్వు ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ ఆల్కహాల్ పుచ్చుకుంటూ సీసీ కెమెరాలకు చిక్కారు. వాటర్ బాటిళ్లను మద్యంతో నింపుకొని సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వీళ్లంతా మద్యం తాగడాన్ని సీసీ కెమెరాలో దృశ్యాలలో వీక్షించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు సస్పెండ్ ఆర్డర్లను జారీ చేశారు అలాగే డ్యూటీ లో ఉండి నిబంధనలు ఉల్లంఘించిన ఈ మొక్కల పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.


దేశవ్యాప్తంగా కరోనా రక్కసి తాండవమాడుతున్న వేళ... డాక్టర్ గా తో సహా పోలీసులు కూడా అహర్నిశలు కష్టపడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ డ్యూటీలను సరిగా నిర్వహించకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ అందరి అసహనానికి గురవుతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని కృష్ణలంకలో గత కొన్ని రోజుల క్రితం ఇతర కానిస్టేబుల్ లో మద్యం తాగుతూ సస్పెండ్ కి గురయ్యారు.


అది మరవకముందే మళ్లీ ఈరోజు ముగ్గురు పోలీసులు మద్యం తాగటం అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు పోలీసు అధికారులపై ద్వారకా తిరుమల రావు కేసులు నమోదుచేసి విధులలో అలసత్వం అస్సలు చూపరాదని హెచ్చరిస్తూ వారిని సస్పెండ్ చేశారు. అప్పట్లో మద్యం తాగుతూ దొరికిపోయినా కానిస్టేబుళ్లను బాగా తిట్టి కోసం సిపి... ఈరోజు దొరికిన వారిపై కూడా తిట్ల దండకం చదివినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పోలీసు వ్యవస్థలో సిన్సియర్ గా పనిచేసే వారికి ఇలాంటి వారు తప్పుడు పనులు చేస్తూ మొత్తం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా మారుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: