కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రపంచంలోనే ధనవంతుడైన ఆ దేవుడికి ప్రస్తుతం ఆర్థిక చిక్కులు వెంటాడుతున్నాయి. ఆయన హుండీ ఆదాయం రోజు కోట్లలోనే వస్తుంది. ఇక ఆయనకు వచ్చే బంగారు ఆభరణాలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా ఏకంగా అత్యంత ధనవంతుడైన దేవుడిగా ప్రస్తుతం డబ్బు లేకుండా అయిపోయాడు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లో నెలకొన్న పరిస్థితి ఇది. దాదాపు రోజుకి రెండు కోట్లకు తగ్గకుండా విరాళాలు వస్తూ ఉంటాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 అలాంటి గొప్ప చరిత్ర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవట. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు చెబుతున్న మాట ఇది . అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. దాదాపుగా 45 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా వైరస్ ప్రభావం కారణంగా పూర్తిగా మూసి వేసిన విషయం తెలిసిందే. లోలోపల పూజారులు స్వామివారికి పూజలు నిర్వహించినప్పటికీ భక్తుల రాక మాత్రం పూర్తిగా నిలిపివేయబడింది. మరి భక్తుల రాక ఉన్నప్పుడే కదా ఆలయానికి ఆదాయం వచ్చేది. 

 

 దీంతో ఆలయానికి ఎలాంటి విరాళాలు అందకపోవడంతో ప్రస్తుతం ఆర్థిక అప్పుల్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. లాక్ డౌన్ కారణంగా  ఏకంగా 400 కోట్ల రెవెన్యూ కోల్పోయామని.. ఎప్పుడు రోజువారీ ఖర్చులు భరించడానికి కూడా ఇబ్బందిగా అవుతోందని అంటున్నారు నిర్వాహకులు. ఇకపై ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ప్రస్తుతం టీటీడీ బోర్డు కృషి చేస్తుందని... ప్రస్తుతం టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ జోలికి పోకుండా  సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: