తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా  కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్  కు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే వైద్యులు వైద్య పరిశోధకులు అంకితభావంతో ఉన్నందుకే  ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా ను  సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతుంది అని  తెలంగాణ  గవర్నర్ తమిళసై సౌందర రాజన్ వ్యాఖ్యానించారు. వైద్యులు ప్రాణాలకు తెగించి ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారు అంటూ ఆమె అభినందించారు. ప్రస్తుతం వైద్యుల అంకితభావం కారణంగానే దేశవ్యాప్తంగా కరోనా  వ్యాప్తిని ఎంతగానో తగ్గించగగలిగాము అంటు  అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాల జోలికి పోకుండా కరోనా వైరస్ పై కలిసికట్టుగా పని చేస్తున్నాయి అంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. తాజాగా సనత్నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్ తమిళ సై... అక్కడ పనిచేస్తున్న వైద్యులను అభినందించారు . వైద్యులందరూ ఓ  వైపు కరోనా  వైరస్ పేషెంట్లను పర్యవేక్షిస్తూ వారి విషయంలో మరి ఈ విషయంలో అంకితభావంతో పని చేయడంతో పాటు సాధారణ రోగులను కోసం కూడా ఈఎస్ఐ వైద్యుల అంకితభావాన్ని  ప్రత్యేకంగా ప్రశంసించారు. 

 

 

 ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కరోనా పేషంట్లను  పరిరక్షించడంతో పాటు సాధారణ జబ్బుతో  బాధ పడుతున్న ప్రజలను  కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా వైరస్ పై ఈఎస్ఐ,  ఆర్టీవో కలిసి పరిశోధనలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటు తమిళ్ సౌందరరాజన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: