ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణ భయంతో వణికిస్తున్న  కరోనా కు  సంబంధించి అమెరికా చైనా పై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా తెరమీదకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చైనా దేశం పై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు  ఈ మధ్యకాలంలో ఆరోపణలు జోరు మరింతగా పెంచారు. ముఖ్యంగా కరోనా వైరస్ను ఊహాన్ వైరాలజీ ల్యాబ్లోనే సృష్టించారని సహజంగా సృష్టించబడింది కాదు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో చైనా విఫలం అయ్యిందని... చైనా స్వయంగా ప్రపంచ దేశాలకు పాకేలా చేసింది అనే ఆరోపణలు ప్రధానంగా అమెరికా చైనా దేశంపై చేస్తుంది. 

 

 

 అయితే చైనా దేశం మొదటి నుంచి ఈ అంశాలను ఖండిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అమెరికా చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అంటూ చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ఆరోపణలు ఖండించింది. చైనా పై అమెరికా చేస్తున్న 24 ఆరోపణలను లెక్కకట్టి ఒక్కొక్క దానికి జవాబు ఇచ్చింది . అమెరికా ఆరోపణలను  ఖండిస్తూ దాదాపు 30 పేజీలను చైనా విదేశాంగ వెబ్సైట్లో పోస్ట్ చేశారు.అన్ని  ఆరోపణలకు  సవివరంగా సమాధానం ఇచ్చారు. 

 

 

 ఇదిలా ఉంటే విదేశాంగమంత్రి మైక్ పాంపియో తదితరులు ఈ మధ్యన ఎక్కువగా  ఇంటర్వ్యూలు ఇస్తూ .. చైనాపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు అంటూ చైనా విదేశాంగ ప్రతినిది హువా చున్ యింగ్  మీడియా సమావేశంలో అమెరికా  ఆరోపణలపై ఎద్దేవా చేశారు. చైనా ప్రభుత్వం పై కరోనా వైరస్ కు సంబంధించి వివిధ ఆరోపణలు చేస్తున్నారని... అమెరికా చేస్తున్న ఆరోపణలపై చైనా తన వైఖరి ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది అని గుర్తు చేశారు. అయితే అమెరికా చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టి  అసలు నిజాలను  ప్రపంచం ముందు ఉంచేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఇక ల్యాబ్ లో వైరస్ తయారు చేస్తారు అన్న ఆరోపణలపై కూడా తీవ్రంగా స్పందిస్తూ...  వుహాన్ లోని  ల్యాబ్ కు   వైరస్ ని తయారు చేసే సామర్థ్యం లేదు అంటూ స్పష్టం చేశారు,

మరింత సమాచారం తెలుసుకోండి: