ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడైతే మొదలైంది.. అన్ని విమానాశ్రయాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. అసలు ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిపోవడానికి ముఖ్యకారణం విమాన ప్రయాణాలు అని తేల్చి చెప్పారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ఇన్ని దేశాలకు వ్యాప్తి చెందడానికి గల కారణం విమాన ప్రయాణమే. మార్చి నెల నుంచి ఇంటర్ నేషనల్ పరిధిలో విమాన రాకపోకలు అన్నీ బంద్ చేశారు. ఇక లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిపివేయడంతో, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఒంటరిగా మిగిలిపోయాడు.

 

టర్కీ నుంచి వెళ్లే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసిన నాటి నుంచి అతడు అక్కడే ఉండిపోయాడు. ఆ దేశ రాయబార కార్యాలయం కూడా సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.  ఎడ్గార్డ్ జీబాట్ ( 40 ) వ్యక్తి మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో విమానం ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి తన గమ్యస్థానానికి వెళ్లాలి. కానీ కరోనా వైరస్ కారణంగా టర్కీ విమానాలను అన్నింటిని రద్దు చేశారు. ఆ వెంటనే లాక్‌డౌన్ విధించారు. న్యూఢిల్లీలో చిక్కుబడిపోయి 54 రోజులుగా ఎయిర్ పోర్టును దాటి బయటకు రాలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో చిక్కుబడిపోయిన విదేశీ ప్రయాణికులకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు అన్ని సౌకర్యాలనూ కల్పించగా, జీబాట్ కు జర్మనీలో నేర చరిత్ర ఉండటంతో, ఆ దేశ ఎంబసీ కల్పించుకోలేదు.

 

మరోవైపు రిలీఫ్ విమానంలో కూడా అతని స్వదేశానికి పంపే అంశంపై జర్మనీ అధికారులు ఎవరూ స్పందించలేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఇతగాడు ప్రతి రోజు న్యూస్ పేపర్లు చదువుతూ.. ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ.. కాలం గడిపేస్తున్నాడు.  విమాన సర్వీసులు ప్రారంభం అయ్యే వరకు అతడు ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు.  లాక్‌డౌన్ ముగిసే వరకు అతనికి ఈ కష్టాలు తప్పేలా లేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: