అటవీ ఉత్పత్తుల సేకరణం ఇపుడు జోరందుకుంది. లాక్ డౌన్ సండలింపులు రావడంతో ఆదివాసీ గూడేలు గాడిలో పడుతున్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన అటవీ ఉత్తపత్తుల సేకరణ ఇపుడు మళ్లీ ఊపందుకుంది. అడవి బిడ్డల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పిల్లలు.. పెద్దలూ అంతా కలిసి అడవుల్లో వెతుకులాట మొదలుపెట్టారు.  

 

అడవుల్లోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారే గిరిపుత్రులు. కేవలం అటవీ సంపదపైనే ఆధారపడి వారి జీవనం సాగుతుంది. అడవి తల్లి ఇచ్చే సంపదను ఎంతో ప్రేమగా స్వీకరించి పొట్టపోసుకుంటుంటారు. అడవులే వీళ్ల జీవనాధారం. వివిధ కాలాల్లో లభించే వివిధ రకాల పండ్లు, భూమిలో లభించే గడ్డలు..తేనె, బంక, పలు రకాల విత్తనాలను సేకరించి పొట్టపోసుకుంటారు.  

 

ఎంతో సరదాగా సాగే వీళ్ల జీవితాన్ని కరోనా మహమ్మారి ఒడిదుడుకులకు గురిచేసింది. అటవీ ఉత్పత్తులను అమ్మి పొట్టపోసుకునే వీళ్లను హీన స్థితిలోకి దిగజార్చేసింది. ముఖ్యంగా వీళ్లు సేకరించే ఇప్ప పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు మోదుగ చెట్ల నుంచి వచ్చే లక్కతో పాటు.. వివిధ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. జీసీసీ ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంది. అంతేకాదు ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. ప్రతీ సంవత్సరం అటవీ ఉత్పత్తులను గిరిజన సంక్షేమ శాఖ కొనసుగోలు చేస్తుంది. ఇప్పటి వరకు అడవి బిడ్డలు సేకరించిన ఉత్పత్తులకు తక్కువ ధర ఉండేది.. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్పత్తులకు మంచి గిరాకీ పెరిగింది. అటవీ ఉత్పత్తులు ఔషధ వినియోగానికి ప్రాధాన్యత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం వాటిని ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తోంది. 

 

అటవీ ఉత్పత్తుల సేకరణకు అనుమతి ఇవ్వడంతోపాటు ధరలను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో తేనే ధర 195 రూపాయలుండగా ఇప్పుడు దాన్ని 225 కు పెంచింది. ఇప్ప పువ్వు కిలోకు 17 ఉండగా 30 రూపాయలకు పెంచింది. తప్పిబంక కిలో 108 పలకగా ఇప్పుడు 114 , ఎండు ఉసిరి 45 నుంచి 52కు పెంచింది. జీడి గింజలపై 3రూపాయలు,కుంకుడు కాయలపై 6 రూపాయలు పెంచడంపై ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ జనాభా మూడు లక్షల వరకు ఉంటుంది. ఆదివాసీల్లో తొమ్మది తెగల వారుండగా,  అందులో చాలామంది అటవీ ఉత్పత్తులను నమ్ముకొని జీవిస్తుంటారు. వీరందరికి ఐటీడీఏ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో  ఎంతో కొంతమంది ఉపాధి పొందుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: