వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు సోమవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి ఆశ్చ‌ర్య ప‌రిచారు. దేశ ద్వితీయ పౌరుడి నుంచి ఫోన్ రావ‌డంతో ఎంపీ ద‌యాక‌ర్ ఒంకింత సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జ‌నాభా క‌లిగిన ప‌ట్ట‌ణంగా ఉన్న వ‌రంగ‌ల్‌లో క‌రోనా వ్యాప్తి గురించి ఉప‌రాష్ట్ర‌ప‌తి ఆరా తీశారు. అలాగే యంత్రాంగం ప‌నితీరు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి సూచించ‌డం గ‌మ‌నార్హం. కరోనాను కట్టిడి చేస్తున్నారా.. లేదా అని ఎంపీని అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు.

 

ఇదిలా ఉండ‌గా వెంక‌య్య‌నాయుడికి వ‌రంగ‌ల్ అంటే ప్ర‌త్యేక అభిమానం. దాదాపు 3ద‌శాబ్దాలుగా దేశ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న ఆయ‌న వ‌రంగ‌ల్ గురించి త‌రుచూ విలేఖ‌రుల వ‌ద్ద ప్ర‌స్తావించేవారు. ఆయ‌న‌కు కాక‌తీయుల చ‌రిత్ర అంటే ఎంతో మ‌క్కువ‌. ముఖ్యంగా కాక‌తీయుల కాలంలో నిర్మించిన ఆల‌యాలు, శిల్పా క‌ళా సౌంద‌ర్యాల‌పై ఆయ‌న ప‌లుమార్లు వేదిక‌ల‌పై కొనియాడారు. ఇక వేయి స్తంభాల ఆలయాన్ని కూడా ఆయ‌న సంద‌ర్శించారు.  ఇదిలా ఉండ‌గా కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

 

అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఉప రాష్ట్రపతి కూడా ఈ నిబంధనలను పాటిస్తున్నారు.  ఈ సమయంలో పార్లమెంటు సభ్యులకు ఫోన్ చేసి కరోనా పరిస్థితి వివరాలేంటని ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పలు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండ‌గా  కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ను పొడిగించాలని వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ కొనసాగిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని సూచించారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: