కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటి నుంచి అమెరికా దేశం చైనా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా  వైరస్ జంతువుల నుంచి నుంచి వచ్చింది కాదని.. చైనా కావాలని మహమ్మారి వైరస్ ను ల్యాబ్ లో తయారు చేసి ప్రపంచ వినాశనానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ విమర్శలు చేస్తోంది. అయితే చైనా పై అమెరికా ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం చైనా కు మద్దతు ప్రకటిస్తూ కాపాడుకుంటూ వస్తోంది. 

 

 అయితే తమకు అనుమానంగా ఉన్నా వుహాన్  నగరంలో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తాము  అంటే చైనా అనుమతించలేదు... తమకు మద్దతుగా ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలను  కూడా అనుమతించలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం సమన్వయంగా ఉండాల్సింది పోయి చైనాకు వత్తాసు పలుకుతూ వస్తుంది అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో అమెరికా ప్రభుత్వం మరిన్ని విమర్శలకు చేస్తుంది . కరోనా  వైరస్ గురించి నిజాలు బయటకు రాకుండా చైనా ప్రభుత్వం కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే దీని గురించి ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్న అందరినీ మాయం చేస్తుంది అంటూ ఆరోపణలు చేస్తోంది. 

 


 అమెరికా ఎన్ని విమర్శలు చేసిన మొదటి నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా దేశాన్ని వెనకేసుకుని వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఒక భిన్న స్వరం వినిపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లో ఉన్న నిపుణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని భిన్న  స్వరాన్ని వినిపించారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులు అందరూ ఒక దేశానికి సంబంధించిన వారు మాత్రమే కాదు కాబట్టి వివిధ స్వరాలు వినిపిస్తున్నారు. తాజాగా పీటర్ బ్రెంక్  అనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి చెందిన నిపుణుడు .. చైనా అర్బన్ సిటీ అయిన వుహాన్  నగరం నుంచి ఈ మహమ్మారి వైరస్ వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటుంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా ఏమైనా చర్యలు తీసుకునేందుకు ముందుకు కదులుతుంద లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: