ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కేసులు దాదాపు 70వేల దగ్గరలో ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 44,029 ఉండగా కరోనా వైరస్ నుండి కోల్పోతున్న వారి సంఖ్య 20,917 బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండు వేలకు పైగానే కరోనా మరణాలు సంభవించాయి. ఇక మహారాష్ట్రలో అయితే కేసులు 22 వేలు దాటిపోయాయి. మొత్తం కేసుల సంఖ్య 22,171 కి చేరుకున్నాయి. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 10000 దగ్గరలో గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. దాదాపు ఎనిమిది వేలకు దగ్గరలో ఉన్న వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 

ఢిల్లీలో కూడా ఏడు వేలకు పైగానే కేసులు నమోదై ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయం వేస్ట్ అని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఉన్న వలస కార్మికులు ఢిల్లీలోనే ఉండాలని కోరారు. ఇదే సమయంలో కాలినడకన వారివారి ప్రదేశాలకు వెళ్లవద్దని అంటున్నారు.

 

వలస కార్మికుల కోసం మరిన్ని రైలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వలస కార్మికుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 75 శాతం వరకూ నమోదైన కేసుల విషయంలో ప్రమాదం లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. చాలావరకు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగి ఉన్నారు ప్రమాదం లేని వ్యాధిగ్రస్తులను ఇంటిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు  కేజ్రీవాల్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: