భారతదేశం లోనే ఉంటూ భారతదేశ శత్రు  దేశమైన పాకిస్థాన్ ను  పొగుడుతూ భారతదేశాన్ని ద్వేషించే వేర్పాటువాద పార్టీ నేతలు భారత దేశంలో చాలామంది ఉన్నారు. అయితే సుదీర్ఘకాలంపాటు పాకిస్తాన్ రెచ్చగొట్టి భారత దేశాన్ని నాశనం చేయాలని ఉగ్రవాదులను  పంపించినప్పుడు వారిని  స్వతంత్ర సమరయోధులు అంటు  ప్రపంచానికి చెప్పడానికి కారణం.. కాశ్మీర్ లో ఉన్నటువంటి వేర్పాటువాద పార్టీల నేతలే. అయితే కాశ్మీర్లోని దారుణమైన ఇటువంటి జీవితానికి ఈ  వేర్పాటువాద పార్టీ నేతలే కారణమని అంటున్నారు విశ్లేషకులు. 

 

 ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు.. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కానీ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాంట్రాక్టు లన్నీ వేరే తీసుకుంటారు. తర్వాత అక్కడున్న  వారిని అందరిని కూలీలుగ అందులో చేర్చుకుని ఉపాధి కల్పిస్తున్నాము  చెబుతూ ఉంటారు. అందుకే ముఫ్తి  కుటుంబానికి వందల వేల కోట్ల ఆస్తులు ఉంటాయి . ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే అక్కడ మార్పు ప్రారంభం కావడంతో అక్కడి వేర్పాటు వాదనాయకులు అందరూ కొంచెంకొంచెంగా.. బయట పడుతున్నారు. ముఫ్తి  తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే తుపాకులు చూపించి ఆర్టికల్ 370 రద్దు చేశారు అంటూ  ఒక ఆరోపణ చేశారు. 

 


 దీనిపై  మాత్రం విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారులు  ఎవరికి తుపాకులు చూపించారు.. ఈయనకు  తుపాకులు చూపించకపోతే మాట వినడ.. అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి  మంచి జరుగుతుంటే చూస్తూ ఊరుకోడ... అన్న ప్రశ్నలు విశ్లేషకులు నుంచి వెల్లువెత్తుతున్నాయి. భారత్ పాకిస్తాన్ పై పోరూ చేస్తున్న తరుణంలో భారత్ కి అండగా ఉండకుండా పాకిస్తాన్ కు అండగా ఉండి...  ప్రస్తుతం ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే తుఫాకులతో నడుస్తున్న ప్రజాస్వామ్యాన్ని సాధారణ ప్రజాస్వామ్యం వైపు తీసుకెళ్తుంటే మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: