ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం జరిగింది. అగ్రరాజ్యం అమెరికా అయితే ఈ వైరస్ దెబ్బకీ చాలా వరకు ప్రాణం మరియు ఆర్ధిక నష్టం చవిచూసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా...అందులో పది లక్షలకు పైగా వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవటం జరిగింది. ఇదే సందర్భంలో మూడు లక్షల మంది మరణించడం జరిగింది. అమెరికాలో అయితే అత్యధికంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరణాలు కూడా అదే రీతిలో సంభవిస్తున్నాయి.

 

యూరప్ వంటి దేశాలలో వైరస్ కి అనుకూలంగా వాతావరణం ఉండటంతో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అయినప్పటికీ ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని చాలా దేశాలు లాక్ డౌన్ ఎత్తివేతకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు మాత్రం ఏమాత్రం రిస్కు తీసుకోకూడదని అనుకుంటున్నాయి. ఈ సందర్భంగా 2021 జనవరి దాకా 'వర్క్ ఫ్రం హోం' ఆదేశాలను పాటించడమే బెస్ట్ అని ఆ కంపెనీలు అంతర్గత ఆదేశాలు తమ ఉద్యోగస్తులకు జారీ చేశాయి.

 

ఎవరైనా ఉద్యోగస్తులు ఆఫీసులో కి వస్తాను అంటే వద్దు అని చెప్పాము కానీ పరిస్థితి అర్థం చేసుకోవాలని కంపెనీ యాజమాన్యాలు సూచిస్తున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అదేవిధంగా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే ఏడాది ప్రారంభం దాకా పరిస్థితి ఏమీ మారదని ఉద్యోగస్తులు అంతా సహకరించాలని కోరడం జరిగింది.  మరోపక్క సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాలు కూడా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం నే ప్రిఫర్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: