ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో ప్రజల్లో భయం, ఆందోళన తొలగిస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. కేంద్రం సూచనలను పాటించి కరోనా పాజిటివ్‌ కేసులను నియంత్రించగలిగామని చెప్పారు. ఈరోజు మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగన్ పలు సూచనలు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని....కరోనాను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని అన్నారు. 
 
క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచన చేయాల్సి ఉందని...కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా ఐసొలేషన్‌కు వెళ్లేలా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌తో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందని పేర్కొన్నారు. హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవని సీఎం చెప్పారు. పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో స్పష్టమైన ప్రామాణికతను రూపొందించాలని చెప్పారు. 
 
ప్రజలు కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకొనేలా చేయాలని అన్నారు. టెలి మెడిసిన్, కాల్‌ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయని... ప్రజలకు హోం ఐసోలేషన్ గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. వృత్తాలు గీయడం ద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయాలని అన్నారు. మీడియాలో కరోనాపై వాస్తవాలు చెప్పే కథానాలు రావాలని అన్నారు.                    
 
వైద్య విధానం, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉందని వరికి వారు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. లాక్ డౌన్ ను సడలించాలని... కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు మార్చాలని కోరారు. ప్రజా రవాణాకు అనుమతులు ఇవ్వాలని తద్వారా రాష్ట్రాలకు ఆదాయం చేకూరుతుందని సీఎం మోదీని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: