కరోనా వైరస్ వల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడానికి నగదు రూపంలో డబ్బులు పంపిణీ చేయడం మనకు అందరికీ తెలిసినదే. లాక్ డౌన్ కారణంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ల కుటుంబాలకు నగదు రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల మూడోదశ లాక్ డౌన్ పొడిగించిన సందర్భంలో మద్యం దుకాణాలకు మినహాయింపు ఇవ్వటంతో ఒక్కసారిగా మందుబాబులు రికార్డు స్థాయిలో మందు కొనడం జరిగింది. దీంతో ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బు పేద కుటుంబానికి చెందిన వాళ్లు మందు కొనుక్కొని తాగడంతో మహిళలు నరకం చూస్తున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలని ఆదుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు మందుబాబులు ఇష్టానుసారంగా తమ స్వలాభం కోసం ఖర్చు పెట్టడం తో మహిళలు తిండిలేక నరకం చూస్తున్నారు.

 

ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి తెలివిగా మద్యం దుకాణాలు ఓపెన్ చేయటంతో మందుబాబులు ధరలు పెంచిన గాని  ఏ  మాత్రం లెక్కచేయకుండా మద్యం బాటిల్స్ కొనటం తో మహిళలు ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేయకపోతే ఏమైపోతుందో అని ప్రశ్నిస్తున్నారు. మద్యం ధరలు పెంచిన గాని మందుబాబులు త్రాగడం మానలేకపోతుండడంతో  పాటు కుటుంబంలో ఉన్న ఆడవాళ్లని విపరీతంగా వేధిస్తున్నారు. ఒకపక్క మద్యం అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా మద్యం షాపులు తగ్గటం వల్ల మాత్రమే అలా అనిపిస్తుంది. మామూలుగా అయితే మందుబాబులు ఎక్కడ మానేసిన సందర్భాలు లేవు అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఎందుకంటే, ఈ ఊరిలో దొరక్కపోతే, ఇంకో ఊరికి వెళ్ళి మరీ మద్యాన్ని సేవించేందుకు మందుబాబులు వెనుకడగు వేయడం లేదు...అలాంటి పరిస్థితులే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తెరవగానే ఇటు తెలంగాణ నుంచీ, అటు తమిళనాడు నుంచీ బోర్డర్‌ దాటొచ్చి మరీ మద్యం కొనుగోళ్ళు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు పెంచేయడంతో తెలంగాణ బోర్డర్ లో మందుబాబులు మద్యం కొనుగోలు చేస్తున్నారు. సో ఏ విధంగా చూసిన ప్రభుత్వాలు ఇచ్చినా డబ్బులు మందుబాబులు తమ సొంత లాభం కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్లను ఏడిపిస్తూ మందు తాగుతున్నారు అని అనటంలో ఏటువంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: